విమాన ప్రయాణికులకు శుభవార్త. రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా బడ్జెట్ ఎయిర్‌లైన్ కంపెనీ స్పైస్‌జెట్ తన ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
Spicejet: విమాన ప్రయాణికులకు శుభవార్త. రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా బడ్జెట్ ఎయిర్‌లైన్ కంపెనీ స్పైస్‌జెట్ తన ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. దీనికి ముందు టాటాల యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా సైతం స్పెషల్ డిస్కౌంట్లకు టిక్కెట్లను ప్రయాణికులకు ఆఫర్ చేసింది.

చౌకగా టిక్కెట్లు..
రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా కొత్త ఆఫర్ తో తన బడ్జెట్ ప్రయాణికులను ఆకట్టుకు వచ్చేసింది. ఈ ఆఫర్ కింద ప్రయాణికులు కేవలం రూ.1,126 ధరకే పొందగలరని విమానయాన సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్ కింద కంపెనీ ఎంపిక చేసిన దేశీయ విమాన టిక్కెట్ల బేస్ ఫేర్‌పై ప్రయాణికులకు 26 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

తొమ్మిది నెలల పాటు..
విమాన ప్రయాణికులు స్పెస్ జెట్ ఆఫర్ కింద టిక్కెట్లను జనవరి 24, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2023 మధ్య కాలం కోసం బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారు ముందుగా టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు జనవరి 24 నుంచి జనవరి 29 వరకు అవకాశాన్ని కల్పిస్తున్నట్లు విమానయాన సంస్థ వెల్లడించింది. 'ADDON26' ప్రోమో కోడ్‌తో ప్రయాణికులు గరిష్ఠంగా టిక్కెట్ ధరపై 26 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ క్రమంలో ప్రయాణికులు ఇష్టమైన సీటు, భోజనంతో పాటు ఇతర యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు.

Gofirst ఆఫర్..
రిపబ్లిక్ డే సందర్బంగా గో ఫస్ట్ విమానయాన సంస్థ సైతం డొమెస్టిక్ ప్రయాణాలకు అత్యత్పంగా రూ.1,199 రేటుకే టిక్కెట్లను అందిస్తోంది. ఇదే సమయంలో అంతర్జాతీయ విమాన ప్రయాణానికి టిక్కెట్ ధరను రూ.6,599కే అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్ రేట్ల కింద టిక్కెట్లను కొనుగోలు చేసుకునేందుకు జనవరి 23-26 వరకు వెసులుబాటును కల్పించింది. ఫిబ్రవరి 12 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో చేయాలనుకునే ప్రయాణాలకు ముందుగా ఈ స్కీమ్ కింద ముందుగా టిక్కెట్లను కొనుక్కోవచ్చని కంపెనీ వెల్లడించింది.

ఎయిర్ ఇండియా..
భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎయిర్‌లైన్స్ దేశీయ ప్రయాణికులకు రాయితీ టిక్కెట్లను గతవారం విక్రయించింది. రిజిస్టర్డ్ ట్రావెల్ ఏజెంట్లతో సహా అన్ని ఎయిర్ ఇండియా బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంచింది. అయితే రాయితీ టిక్కెట్లు కేవలం ఎకానమీ క్లాస్ ప్రయాణానికి మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications