కేంద్ర బడ్జెట్‌కు రెండు వారాల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో.. ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్కెట్ భాగస్వాములు, పరిశ్రమ సంఘాలు, పెట్టుబడిదారుల నుంచి వచ్చిన పన్ను-విధాన సూచనలను విస్తృతంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా రికార్డు స్థాయిల వద్ద ట్రేడవుతున్న వేళ..సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBలు) పునఃప్రారంభం ఒక కీలక చర్చాంశంగా మారింది. బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు నిర్మాణాత్మక, పారదర్శక, పన్ను.. సమర్థవంతమైన మార్గాన్ని SGBలు అందిస్తాయని అనేక మంది పెట్టుబడిదారులు సూచిస్తున్నారు.
SGBలు చురుకుగా జారీ అయిన కాలంలో.. అవి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బంగారు పెట్టుబడి సాధనాలలో ఒకటిగా నిలిచాయి. ప్రభుత్వ మద్దతుతో జారీ చేయబడే ఈ బాండ్లు, భౌతిక బంగారానికి సంబంధించిన నిల్వ, స్వచ్ఛత, భీమా వంటి సమస్యలను తొలగించాయి. అంతేకాదు, Gold ధరలు పెరిగినప్పుడు మూలధన లాభం పొందడమే కాకుండా, పెట్టుబడిదారులకు సంవత్సరానికి 2.5 శాతం స్థిర వడ్డీ కూడా అందించాయి. ముఖ్యంగా, మెచ్యూరిటీ సమయంలో రిడెంప్షన్‌పై మూలధన లాభాలు పన్ను రహితంగా ఉండటం వల్ల, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇవి మరింత ఆకర్షణీయంగా మారాయి.

అయితే.. ప్రస్తుతం కొత్త SGB ట్రాంచ్‌లు అందుబాటులో లేవు. ఈ పథకం జారీ 2024 ప్రారంభంలో నిలిపివేయగా.. చివరి విడతగా SGB 2023-24 సిరీస్ IV ఫిబ్రవరి 2024లో జారీ చేయబడింది. ఇప్పటికే జారీ అయిన బాండ్లు వడ్డీని పొందుతూనే ఉన్నాయి. వాటి అసలు నిబంధనల ప్రకారం రీడీమ్ చేయబడతాయి. కానీ, కొత్త పెట్టుబడులకు అవకాశం లేకపోవడంతో, పెట్టుబడిదారులు RBI లేదా PIB నుండి వచ్చే విధాన ప్రకటనలను గమనించాలని సూచిస్తున్నారు.
ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించాలా అనే విషయంలో పరిశ్రమ నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వైస్ ప్రెసిడెంట్, ఆస్పెక్ట్ గ్లోబల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ అక్ష కాంబోజ్ మాట్లాడుతూ.. SGBలు ఇప్పటికీ బంగారం ఆర్థికీకరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. మార్కెట్ అస్థిరత పెరుగుతున్న వేళ, అలాగే బంగారం ధరలు కొత్త గరిష్టాలను తాకుతున్న నేపథ్యంలో, పారదర్శక పెట్టుబడి సాధనాలను మళ్లీ పరిశీలించడం సమయోచితమని అన్నారు. అయితే, ధరల అస్థిరతను దృష్టిలో ఉంచుకుని, ఏదైనా పునఃప్రారంభం పెట్టుబడిదారులు, ప్రభుత్వానికి స్పష్టమైన నిష్క్రమణ విధానాన్ని కలిగి ఉండాలని ఆమె సూచించారు.
ఇక కొంతమంది మార్కెట్ నిపుణులు పెట్టుబడిదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయని అంటున్నారు. బంగారం ధరలు పెరగడంతో, బంగారు ETFలు, క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికల ద్వారా పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని స్టేబుల్ మనీ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ జైన్ తెలిపారు. SEBI నియంత్రిత బంగారు ETFలు సౌలభ్యం, ద్రవ్యత, నియంత్రణ పర్యవేక్షణను అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే చారిత్రాత్మకంగా SGBలు బలమైన ఫలితాలను ఇచ్చినప్పటికీ.. బంగారం ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వానికి ఈ పథకం ఖరీదైన నిధుల ఎంపికగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం కూడా ఇదే ఆందోళనను అధికారికంగా వ్యక్తం చేసింది. పార్లమెంటులో ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2015లో ప్రారంభమైన SGB పథకం ద్వారా మార్చి 31, 2025 నాటికి సుమారు 146.96 టన్నుల బంగారానికి సమానమైన చందాలు, దాదాపు రూ.72,275 కోట్ల విలువ సమీకరించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలను పెంచడంతో, SGBల ద్వారా రుణ వ్యయం కూడా పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ 2026లో SGBలను తిరిగి తీసుకు వస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం ధర ఈ రేటుకు రాగానే కొనడం వెంటనే ఆపేయండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ వ్యూహా కర్తలు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనాలా..వెండి కొనాలా.. ఇరాన్ యుద్ధంతో ఇన్వెస్టర్లు ఆందోళన..నిపుణులు ఏమంటున్నారంటే..

Gold Silver: ఆ గ్లోబల్ రిపోర్ట్ చెప్పినట్లుగా బంగారం రేటు ఆకాశాన్ని తాకబోతోందా?

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరల పెరుగుదలపై లేటెస్ట్ రిపోర్ట్.. సరికొత్త నివేదికను విడుదల చేసిన ప్రముఖ బ్యాంకులు

బంగారం ధరలపై దిమ్మతిరిగే న్యూస్.. పసిడి ధర భారీగా పెరగడానికి ఈ మూడే కారణం.. భవిష్యత్తులో కూడా..

సముద్రం అడుగున సీక్రెట్ బంగారం ఫ్యాక్టరీ.. ప్రపంచానికి తెలియని షాకింగ్ నిజం.. బట్టబయలు చేసిన సైంటిస్టులు..

Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?



Click it and Unblock the Notifications