బంగారం మీద పెట్టుబడి పెట్టే వారికి 'సావరీన్ గోల్డ్ బాండ్స్' (SGB) ఒక వరం లాంటివి. ఫిజికల్ గోల్డ్ కంటే వీటిలో రిస్క్ తక్కువ, పైగా ఏటా వడ్డీ కూడా వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా, మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే వచ్చే లాభం మీద ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను కట్టక్కర్లేదు. కానీ, తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ (Budget 2026) లో ఒక కీలక మార్పు చేశారు. దీనివల్ల కొందరు ఇన్వెస్టర్లకు ఇకపై ఆ పన్ను మినహాయింపు లభించదు.

ఏమిటీ కొత్త రూల్?
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. మీరు గోల్డ్ బాండ్స్ (SGB) ని ప్రభుత్వం నుంచి నేరుగా కొన్నా లేదా స్టాక్ మార్కెట్ (Secondary Market) లో ఎవరి దగ్గరైనా కొన్నా.. 8 ఏళ్ల మెచ్యూరిటీ పూర్తయ్యాక వచ్చే లాభంపై పన్ను ఉండేది కాదు. కానీ బడ్జెట్(Budget 2026) ప్రతిపాదనల ప్రకారం.. ఇకపై ఈ మినహాయింపు కేవలం 'ఒరిజినల్ సబ్‌స్క్రైబర్స్'కు మాత్రమే అందుతుంది. అంటే, ఆర్‌బీఐ (RBI) కొత్త బాండ్లను విడుదల చేసినప్పుడు నేరుగా దరఖాస్తు చేసుకుని కొన్నవారికే ఈ వెసులుబాటు ఉంటుంది.
సెకండరీ మార్కెట్ ఇన్వెస్టర్లపై ప్రభావం
చాలామంది ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ లో తక్కువ ధరకే దొరుకుతున్నాయని పాత గోల్డ్ బాండ్లను కొంటూ ఉంటారు. వీరు మెచ్యూరిటీ వరకు వేచి చూసినా, ఇకపై వచ్చే లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బడ్జెట్ (Budget 2026) ప్రకారం.. మీరు కొన్న ధరకు , మెచ్యూరిటీ సమయంలో మీకు వచ్చే ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని 'క్యాపిటల్ గెయిన్స్' గా పరిగణిస్తారు. ఇది ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి వస్తుంది.
ఎందుకు ఈ మార్పు?
ప్రభుత్వం ఉద్దేశం ప్రకారం.. ఈ స్కీమ్ అనేది దీర్ఘకాలిక పొదుపు కోసం ఉద్దేశించబడింది. మార్కెట్ లో తక్కువ ధరకు కొని, మెచ్యూరిటీ లాభాలను పన్ను లేకుండా పొందే 'ఆర్బిట్రేజ్' (Arbitrage) అవకాశాలను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 70(1)(x) కింద ఉన్న నిబంధనలను సవరిస్తూ కేవలం అసలైన ఇన్వెస్టర్లను మాత్రమే ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మెచ్యూరిటీ కంటే ముందు అమ్మితే?
ఒకవేళ మీరు ఆర్‌బీఐ దగ్గర నేరుగా బాండ్లు కొన్నా సరే.. 8 ఏళ్ల కంటే ముందే స్టాక్ మార్కెట్‌లో అమ్మేస్తే పన్ను వర్తిస్తుంది. కేవలం మెచ్యూరిటీ వరకు (8 ఏళ్లు) ఉంచుకున్నప్పుడు మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. కొత్తగా బాండ్లు కొనాలనుకునే వారు బడ్జెట్ లో వచ్చిన ఈ మార్పులను గమనించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!



Click it and Unblock the Notifications