భారతదేశంలో ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రతను మెరుగుపరిచే దిశగా బడ్జెట్ (Budget 2026) లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే ఎస్బీఐ రీసెర్చ్ (SBI Research) తన 'ప్రిల్యూడ్ టు యూనియన్ బడ్జెట్ 2026-27' నివేదికలో పెన్షన్ రంగానికి సంబంధించి సంచలన సిఫార్సులను చేసింది. ముఖ్యంగా ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరింది.

UPS , NPS వాత్యల్య: విస్తరణ అవసరం
నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన UPS లో ఇప్పటివరకు కేవలం 1.2 లక్షల మంది మాత్రమే చేరారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు , PSU (ప్రభుత్వ రంగ సంస్థలు) ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ఎస్బీఐ రీసెర్చ్ సూచించింది. అలాగే చిన్నపిల్లల కోసం తీసుకొచ్చిన 'NPS వాత్యల్య' పథకంపై పన్ను రాయితీలు పెంచాలని, సెక్షన్ 80CCD(1B) కింద అదనపు మినహాయింపులు కల్పించడం ద్వారా దీనిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావచ్చని పేర్కొంది.
EPFO ఆధునీకరణ, పన్ను సడలింపులు
ప్రస్తుతం ఉన్న EPFO (ఉద్యోగుల భవిష్య నిధి) వ్యవస్థను NPS తరహాలో సాంకేతికత , పారదర్శకతతో ఆధునీకరించాలని నివేదిక కోరింది. దీనివల్ల ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు వారి పెన్షన్ ఖాతాలను సులభంగా తరలించుకోవచ్చు (Interoperability). అంతేకాకుండా ఇన్సూరెన్స్ ప్రొడక్టులు, పెన్షన్ స్కీమ్స్‌పై పన్ను విధింపులో సమానత్వం (Uniform Tax Treatment) ఉండాలని, తద్వారా ఇన్వెస్టర్లు పన్ను ప్రయోజనాల కోసం కాకుండా తమ అవసరాల మేరకు సరైన పథకాన్ని ఎంచుకుంటారని ఎస్బీఐ రీసెర్చ్ విశ్లేషించింది.
ప్రైవేట్ రంగానికి తప్పనిసరి NPS?
ప్రైవేట్ రంగంలో పని చేసే కోట్లాది మందికి పెన్షన్ సౌకర్యం లేదు. దీనిని పరిష్కరించడానికి, 100 లేదా 200 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రైవేట్ సంస్థల్లో NPS సహకారాన్ని తప్పనిసరి చేయాలని ఎస్బీఐ ప్రతిపాదించింది. ఇది భారత్‌లో పెన్షన్ కవరేజీని గణనీయంగా పెంచుతుంది.
UPS & NPS మధ్య రిలేషన్...
పెన్షన్ ఎంపిక విషయానికి వస్తే, ప్రభుత్వ ఉద్యోగులకు Budget 2026 లో UPS ఒక వరంలా మారనుంది. ఎందుకంటే, UPS కింద ఉద్యోగి పదవీ విరమణ చేసిన చివరి 12 నెలల సగటు జీతంలో 50 శాతం పెన్షన్‌గా గ్యారెంటీగా లభిస్తుంది. అంతేకాకుండా ధరల పెరుగుదలకు అనుగుణంగా 'డియర్నెస్ రిలీఫ్' (DR) కూడా అందుతుంది. దీనికి విరుద్ధంగా, NPS అనేది పూర్తిగా మార్కెట్ గమనంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో రిటర్న్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, పక్కాగా ఇంత పెన్షన్ వస్తుందని చెప్పలేము. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను గమనించి, ఇన్వెస్టర్లు తమ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలని ఎస్బీఐ నివేదిక స్పష్టం చేస్తోంది.
మొత్తానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తులో ఉద్యోగులకు మరింత ఆర్థిక భరోసా లభిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications