మన దేశంలో సొంత ఇల్లు కొనడం అనేది ఒక కల. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ రీత్యా ఒక నగరం నుండి మరో నగరానికి మారే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే ఇప్పుడు అందరి చూపు 'రెంటల్ హౌసింగ్' (అద్దె ఇళ్లు) పై పడింది. మరికొద్ది రోజుల్లో రాబోతున్న బడ్జెట్ (Budget 2026) పై సామాన్యుల నుండి డెవలపర్ల వరకు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా అద్దె ఇళ్ల మార్కెట్ ను ఒక పద్ధతిలోకి తీసుకురావడానికి కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్.

అద్దె ఇళ్లకు 'ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' హోదా దక్కేనా?
ప్రస్తుతం మన దేశంలో అద్దె ఇళ్ల మార్కెట్ అంతా అసంఘటితంగా ఉంది. దీనిని ఒక ప్రొఫెషనల్ బిజినెస్ గా మార్చాలని నిపుణులు కోరుతున్నారు. 'బిల్డ్-టు-రెంట్' (అద్దె కోసమే ఇళ్లను నిర్మించడం) ప్రాజెక్టులకు బడ్జెట్ (Budget 2026) లో ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తారని బిల్డర్లు ఆశిస్తున్నారు. నిర్మాణ రంగంలో వాడే మెటీరియల్‌పై GST తగ్గించడం ద్వారా అద్దె ఇళ్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల సామాన్యులకు తక్కువ ధరకే మంచి వసతులున్న ఇళ్లు లభిస్తాయి.
REITs సంస్కరణలతో పెట్టుబడుల వెల్లువ
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (REIT) అనేది సామాన్యులు కూడా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టేలా చేస్తుంది. అయితే ప్రస్తుతం ఇందులో ఉన్న పన్ను నిబంధనలు కొంచెం గందరగోళంగా ఉన్నాయి. ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో ఈ పన్ను విధానాన్ని సరళతరం చేస్తే.. సామాన్యులు కూడా ధైర్యంగా పెట్టుబడులు పెడతారు. దీనివల్ల డెవలపర్ల వద్ద నగదు లభ్యత పెరిగి, మరిన్ని అద్దె ఇళ్ల ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయి.
అద్దె కడితే లోన్ రావడం ఈజీ అవుతుందా?
చాలా మంది యువ వృత్తి నిపుణులు తమ సంపాదనలో 30 నుండి 40 శాతం అద్దెకే ఖర్చు చేస్తారు. నెలకు వేల రూపాయలు క్రమం తప్పకుండా అద్దె కడుతున్నా, ఆ రికార్డులు క్రెడిట్ స్కోరుకు ఎక్కవు. బడ్జెట్ (Budget 2026) లో అద్దె చెల్లింపులను కూడా క్రెడిట్ హిస్టరీలో చేర్చేలా నిబంధనలు వస్తే, భవిష్యత్తులో వారికి బ్యాంక్ లోన్లు రావడం చాలా సులభం అవుతుంది. డిజిటల్ పద్ధతిలో అద్దె చెల్లించే వారిని ఆర్థికంగా ప్రోత్సహించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుంది.
మారనున్న నగరాల ముఖచిత్రం
పారిశ్రామిక ప్రాంతాలు, ఐటీ కారిడార్ల సమీపంలో అద్దె ఇళ్ల కొరత ఎక్కువగా ఉంది. ప్రభుత్వం గనుక ఈ బడ్జెట్ లో ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ల వెంబడి అద్దె ఇళ్ల నిర్మాణానికి పన్ను మినహాయింపులు ఇస్తే, ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. కేవలం ఇళ్లు అమ్మడమే కాకుండా.. అద్దెకు ఇచ్చే మోడల్‌ను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తే రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది.
మొత్తానికి ఈ సారి బడ్జెట్ (Budget 2026) అనేది కేవలం అంకెలే కాకుండా, దేశంలోని కోట్లాది మంది అద్దెదారుల కలలను , రియల్ ఎస్టేట్ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపు కానుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications