భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పోటీ పరీక్షల తీరు మారబోతోందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న బడ్జెట్ (Budget 2026) లో విద్యా రంగానికి సంబంధించి భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా "వన్ నేషన్, వన్ ఎగ్జామ్" అనే నినాదం ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. కేవలం సీట్ల సంఖ్యను పెంచడం మాత్రమే కాకుండా విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశగా అడుగులు పడనున్నాయి.

1978 నుంచి నేటి వరకు ఉన్న ఐఐటీ-జేఈఈ (JEE) గణాంకాలను గమనిస్తే ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. గత ఐదు దశాబ్దాల్లో సీట్ల సంఖ్య 7 రెట్లు పెరిగితే.. పోటీ పడే విద్యార్థుల సంఖ్య మాత్రం ఏకంగా 48 రెట్లు పెరిగింది. ప్రభుత్వం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నప్పటికీ.. పోటీ మాత్రం రోజురోజుకూ కఠినతరమవుతోంది. ఈ అంతరాన్ని తగ్గించడమే ఈ సారి బడ్జెట్ (Budget 2026) ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
AI & డిజిటల్ విద్యకు పెద్ద పీట
రాబోయే బడ్జెట్ (Budget 2026) లో 'దీక్ష' (DIKSHA), 'స్వయం' (SWAYAM) వంటి ప్రభుత్వ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్లాట్‌ఫారమ్‌లకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. కేవలం బట్టీ పట్టడం కాకుండా, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని (Skill-based learning) పెంపొందించడంపై ఫోకస్ పెట్టనున్నారు. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను తక్కువ ధరకే అందుబాటులోకి తేవడమే ఈ బడ్జెట్ లక్ష్యం.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
ప్రస్తుతం టాప్ 500 ర్యాంకర్లలో 90 శాతం మంది కేవలం ఐఐటీ బాంబే వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే దేశంలోని మిగిలిన సంస్థలకు, వీటికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. అందుకే పోటీ పరీక్షలన్నింటినీ క్రమబద్ధీకరించి.. ఏడాదికి ఒకసారి కాకుండా ఎప్పుడైనా రాసుకునేలా "ఆప్టిట్యూడ్" ఆధారిత పరీక్షలను ప్రవేశపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020) అమలులో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో శిక్షణ నిధులు పెంచే అవకాశం ఉంది. నేడు దేశంలో పదివేల కంటే తక్కువ మంది సర్టిఫైడ్ కెరీర్ కౌన్సిలర్లు ఉన్నారు. విద్యార్థులు ఏ రంగం ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అందుకే పాఠశాల విద్యతోనే కోచింగ్ ను అనుసంధానం చేసి, చిన్నప్పటి నుంచే సాఫ్ట్ స్కిల్స్ , టెక్నికల్ స్కిల్స్ నేర్పించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
ఏదేమైనా మొత్తానికి ప్రభుత్వం మిగతా రంగాలతో పాటు విద్యా రంగంపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలని నిపుణులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం, కోచింగ్ సెంటర్లు పోటీదారులుగా కాకుండా, భాగస్వాములుగా పనిచేసినప్పుడే భారత విద్యార్థుల భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. మరి చూద్దాం ఈ బడ్జెట్ లో విద్యా రంగానికి మేలు చేసేలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో!
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications