ఫిబ్రవరి 1వ తేదీ వచ్చిందంటే చాలు.. దేశమంతా టీవీల ముందు అతుక్కుపోతుంది. మన జేబుపై పడే భారం ఎంత? వచ్చే ఆదాయంలో మిగిలేది ఎంత? అని ప్రతి సామాన్యుడు ఆత్రుతగా ఎదురుచూసే సమయం వచ్చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఫిబ్రవరి 1న తన తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో, Budget 2026 కు ముందు గత ఐదేళ్లలో ఆమె తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఏంటో ఒక్కసారి చూద్దాం.

జీతగాళ్లకు భారీ ఊరట: 12.75 లక్షల వరకు నో ట్యాక్స్!
గత ఐదేళ్లలో మధ్యతరగతి ప్రజలకు అత్యంత సంతోషాన్నిచ్చిన అంశం పన్ను పరిమితి పెంపు. 2025 బడ్జెట్‌లో నిర్మలమ్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే ఉద్యోగులకు ఏడాదికి రూ. 12.75 లక్షల వరకు (స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75,000తో కలిపి) ఎలాంటి ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేకుండా చేశారు. అంతకుముందు 2023లో ఈ పరిమితి రూ. 7.5 లక్షలుగా ఉండేది. అంటే అతి తక్కువ కాలంలోనే పన్ను రహిత ఆదాయ పరిమితిని భారీగా పెంచి సామాన్యుడి చేతిలో ఎక్కువ డబ్బు ఉండేలా చేశారు.
కొత్త పన్ను విధానం ఇక 'డిఫాల్ట్'
మొదట్లో 2020లో 'న్యూ ట్యాక్స్ రెజీమ్'ను ఒక ఆప్షన్‌గా మాత్రమే ప్రవేశపెట్టారు. కానీ 2023 బడ్జెట్ నుండి దీనిని డిఫాల్ట్ విధానంగా మార్చారు. అంటే మీరు ప్రత్యేకంగా పాత విధానం కావాలని కోరుకోకపోతే, ఆటోమేటిక్‌గా కొత్త విధానం కిందకే వస్తారు. పన్ను స్లాబులను తగ్గించి, పేపర్ వర్క్ లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం సులభతరం చేయడమే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లో పెను మార్పులు
కేవలం జీతగాళ్లకే కాదు, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు కూడా 2024 బడ్జెట్ షాక్ ఇచ్చింది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (STCG)ను 15% నుండి 20%కి పెంచారు. అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్నును 12.5% కి ఏకీకృతం చేశారు. రియల్ ఎస్టేట్ విషయంలో 'ఇండెక్సేషన్' ప్రయోజనాన్ని తొలగించడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే దీనివల్ల పన్ను గందరగోళం తగ్గి, అన్ని ఆస్తులపై ఒకే రకమైన పన్ను విధానం వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది.
క్రిప్టో కరెన్సీపై పన్నుల మోత
డిజిటల్ కరెన్సీల హవా పెరగడంతో 2022లో ప్రభుత్వం వీటిపై స్పష్టతనిచ్చింది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ (క్రిప్టో) ద్వారా వచ్చే లాభాలపై ఏకంగా 30% పన్ను విధించారు. అలాగే ప్రతి లావాదేవీపై 1% TDS వర్తింపజేయడం ద్వారా క్రిప్టో ట్రేడింగ్‌పై పట్టు బిగించారు.
స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
ఉద్యోగులకు నేరుగా లభించే స్టాండర్డ్ డిడక్షన్‌ను 2024లో రూ. 50,000 నుండి రూ. 75,000కి పెంచారు. పెన్షనర్లకు కూడా ఫ్యామిలీ పెన్షన్ డిడక్షన్‌ను రూ. 15,000 నుండి రూ. 25,000కి పెంచి ఊరటనిచ్చారు.
వచ్చే Budget 2026 లో మళ్ళీ ఇలాంటి విప్లవాత్మక మార్పులు ఏమైనా ఉంటాయా? పన్ను పరిమితిని మరింత పెంచుతారా? లేదా అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications