Budget 2026: మీ మొబైల్‌లోనే బడ్జెట్ రిపోర్ట్.. ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు పొందే మార్గం ఇదే!
భారతదేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే బడ్జెట్ (Budget 2026) కు సమయం ఆసన్నమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఒక దశాబ్దం తర్వాత ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా నిర్మలా సీతారామన్ కు ఇది వరుసగా తొమ్మిదవ బడ్జెట్ కావడం ఒక విశేషమైన మైలురాయి.

బడ్జెట్ ప్రసంగాన్ని లైవ్‌లో ఎక్కడ చూడాలి?
ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమవుతుంది. మీరు దీనిని కింది ప్లాట్‌ఫారమ్స్ ద్వారా ప్రత్యక్షంగా చూడవచ్చు..
- Sansad TV: యూట్యూబ్‌లోని సంసద్ టీవీ ఛానెల్‌లో వివిధ భాషల్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
- దూర దర్శన్ (Doordarshan): దూరదర్శన్ నెట్‌వర్క్ అంతటా పార్లమెంట్ నుంచి నేరుగా ప్రసారం చేయబడుతుంది.
- అధికారిక వెబ్‌సైట్: బడ్జెట్ అఫీషియల్ వెబ్ సైట్ (indiabudget.gov.in) లో కూడా వీడియో ఫీడ్ అందుబాటులో ఉంటుంది.
- సోషల్ మీడియా: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB), ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక ట్విట్టర్ (X), ఫేస్‌బుక్ పేజీలలో కూడా మీరు లైవ్ చూడొచ్చు.
హల్వా వేడుక.. గోప్యత..
బడ్జెట్ తయారీలో 'హల్వా వేడుక' అనేది చాలా కీలకమైన సాంప్రదాయం. జనవరి 27న నార్త్ బ్లాక్ లో ఈ వేడుక నిర్వహించబడింది. ఈ వేడుక పూర్తయిన వెంటనే బడ్జెట్ తయారీలో పాల్గొనే అధికారులు 'లాక్-ఇన్' పీరియడ్‌లోకి వెళ్తారు. అంటే, బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు వీరు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండరు. బడ్జెట్ పత్రాల గోప్యతను కాపాడటమే దీని ప్రధాన ఉద్దేశం.
బడ్జెట్ పత్రాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసిన వెంటనే, అన్ని పత్రాలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌ను అనుసరిస్తోంది.
1. Union Budget Mobile App: ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్, ఫైనాన్స్ బిల్ వంటి అన్ని పత్రాలు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా లభిస్తాయి.
2. వెబ్‌సైట్: బడ్జెట్ వెబ్ సైట్ (indiabudget.gov.in) నుంచి కూడా పిడిఎఫ్ (PDF) రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆర్థిక సర్వే.. అంచనాలు..
ఎకనామిక్ సర్వే 2025-26 ప్రకారం.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి (GDP) వృద్ధి రేటు 6.8% నుండి 7.2% వరకు ఉండవచ్చని అంచనా. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని సర్వే స్పష్టం చేసింది. పెట్టుబడిదారులు, సామాన్య ప్రజలు ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో ద్రవ్యలోటు, పన్ను రాయితీలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు వస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications