Budget 2026: మధ్యంతర vs పూర్తి స్థాయి బడ్జెట్! అసలు తేడా ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు పార్లమెంటులో బడ్జె్ట్ (Budget 2026) ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా శని, ఆదివారాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా అరుదు. గతంలో 2000వ సంవత్సరంలో ఇలా జరగ్గా.. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆదివారం నాడు బడ్జెట్ రాబోతోంది. పన్ను చెల్లింపుదారులు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలు ఈ బడ్జెట్ నుండి భారీ ఊరటను ఆశిస్తున్నారు.

యూనియన్ బడ్జెట్ (Full Budget) అంటే ఏమిటి?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు) ప్రభుత్వం చేసే ఖర్చులు , వచ్చే ఆదాయం యొక్క పూర్తి నివేదికనే 'యూనియన్ బడ్జెట్' అంటారు. ఇందులో విద్యా, వైద్యం, రక్షణ , మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాలకు నిధుల కేటాయింపులతో పాటు, కొత్త పన్ను విధానాలు , భారీ సంస్కరణలను ప్రభుత్వం ప్రకటిస్తుంది.
మధ్యంతర బడ్జెట్ (Interim Budget) అంటే ఏమిటి?
సాధారణ ఎన్నికలు దగ్గరలో ఉన్నప్పుడు లేదా కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే ముందు 'మధ్యంతర బడ్జెట్' ను ప్రవేశపెడతారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు పాలన సాఫీగా సాగడానికి, జీతాలు , ఇతర అత్యవసర ఖర్చుల కోసం పార్లమెంటు నుండి అనుమతి పొందే ప్రక్రియ ఇది. దీనిని 'వోట్ ఆన్ అకౌంట్' అని కూడా అంటారు. సాధారణంగా ఇందులో పెద్ద పెద్ద పాలసీ మార్పులు లేదా కొత్త స్కీమ్ లు ఉండవు.
ప్రధాన వ్యత్యాసాలు ఇవే..
- కాలపరిమితి: మధ్యంతర బడ్జెట్ కేవలం 2 నుండి 4 నెలల తాత్కాలిక అవసరాల కోసం ఉద్దేశించినది. కానీ, బడ్జెట్ (Budget 2026) వంటి పూర్తి స్థాయి బడ్జెట్ ఏడాది పొడవునా అమలులో ఉంటుంది.
- ప్రకటనలు: మధ్యంతర బడ్జెట్‌లో భారీ పన్ను మార్పులు చేయకూడదనే సంప్రదాయం ఉంది. అదే యూనియన్ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను స్లాబుల మార్పు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
- ఆమోదం: మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో మాత్రమే చర్చిస్తారు. కానీ, పూర్తి బడ్జెట్ ఉభయ సభల్లోనూ సుదీర్ఘ చర్చల తర్వాత ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ఈ బడ్జెట్ (Budget 2026) ఎందుకు కీలకం?
ఈ ఏడాది బడ్జెట్‌కు ఎలాంటి ఎన్నికల పరిమితులు లేవు. కాబట్టి ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని పెంచే దిశగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల కోసం మూలధన వ్యయం (Capex) పెంచడం, ద్రవ్య లోటును అదుపులో ఉంచడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.
మొత్తానికి ఈ సారి బడ్జెట్ (Budget 2026) భారత ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిలా మారనుంది. ఇది కేవలం ఆదాయ-వ్యయాల పట్టిక మాత్రమే కాదు. దేశ భవిష్యత్తు అభివృద్ధికి వేసే పునాది. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ చేసే ప్రసంగం దేశ ఆర్థిక దిశను ఎలా మారుస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications