భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది రైల్వే రంగం. ప్రతి ఏటా బడ్జెట్ అనగానే సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ రైల్వే కేటాయింపుల కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మరి కొద్ది రోజుల్లో రాబోతున్న బడ్జెట్ (Budget 2026) లో రైల్వే రంగానికి సంబంధించి భారీ ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈసారి అడుగులు వేస్తోంది.

రూ. 2.65 లక్షల కోట్ల భారీ కేటాయింపులు!
తాజా అంచనాల ప్రకారం.. ఈసారి రైల్వే బడ్జెట్ గత ఏడాది కంటే దాదాపు 5 శాతం పెరిగే అవకాశం ఉంది. జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ ఎండీ వివేక్ లోహియా అభిప్రాయం ప్రకారం.. మొత్తం కేటాయింపులు సుమారు రూ. 2.65 లక్షల కోట్లకు చేరవచ్చు. అంటే ప్రభుత్వం కేవలం కొత్త ప్రాజెక్టులకే కాకుండా ఉన్న రైల్వే నెట్‌వర్క్ ను ఆధునీకరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతోందని అర్థమవుతోంది.
రద్దీని తగ్గించే దిశగా కొత్త అడుగులు
మన దేశంలో రైలు ప్రయాణీకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ట్రాక్ పైన రద్దీ పెరిగి రైళ్లు ఆలస్యంగా నడవడం పెద్ద సమస్యగా మారింది. ఈ బడ్జెట్ (Budget 2026) లో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైల్వే లైన్ల విద్యుదీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దృష్టి కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, డబ్లింగ్ పనులు, గేజ్ కన్వర్షన్ మీద ఉండబోతోంది. ఓడరేవులు, ఖనిజ నిక్షేపాలు ఉన్న ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక కారిడార్లను విస్తరించడం ద్వారా సరుకు రవాణాను మరింత వేగవంతం చేయాలని చూస్తున్నారు.
రైల్వేలో ఏఐ (AI) మ్యాజిక్!
సాంకేతికత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అందుకే భారతీయ రైల్వే ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారీగా వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తోంది. రైలు ప్రమాదాలను అరికట్టడానికి, ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ (ముందుగానే రిపేర్లను గుర్తించడం) అలాగే రైలు నిర్వహణలో వేగం పెంచడానికి ఏఐ సాంకేతికత తోడ్పడనుంది. అంటే ఇకపై సురక్షితమైన, స్మార్ట్ జర్నీని మనం ఆశించవచ్చు.
ప్రైవేట్ పెట్టుబడులు, సంస్కరణలు
ప్రభుత్వ నిధులతో పాటు ప్రైవేట్ రంగ భాగస్వామ్యం (Public-Private Partnerships) కూడా ఈసారి రైల్వే రంగానికి కీలకం కానుంది. కేవలం నిధుల కేటాయింపు మాత్రమే కాకుండా వాటిని క్షేత్రస్థాయిలో ఎంత వేగంగా అమలు చేస్తామనేదే ఈ బడ్జెట్ అసలు లక్ష్యం. నిబంధనలను సరళతరం చేయడం ద్వారా మరిన్ని ప్రైవేట్ కంపెనీలను రైల్వే ప్రాజెక్టుల్లో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
సరుకు రవాణాలో కీలక మార్పులు
ప్రస్తుతం భారతీయ రైల్వే మొత్తం సరుకు రవాణాలో దాదాపు 29 శాతం వాటాను కలిగి ఉంది. నేషనల్ రైల్ ప్లాన్ ప్రకారం 2030 నాటికి 3,000 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేయాలని, 2045 నాటికి రవాణా వాటాను 45 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాలను అందుకోవాలంటే ఈసారి బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం కానున్నాయి.
మొత్తానికి ఈ బడ్జెట్ (Budget 2026) లో రైల్వే రంగం కేవలం బడ్జెట్ అంకెలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రయాణీకుల భద్రత, వేగం, మెరుగైన సౌకర్యాల దిశగా విప్లవాత్మక మార్పులకు నాంది పలకాలని కోరుకుందాం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications