హైదరాబాద్‌కు బిగ్ బూస్ట్.. ఏడు హై-స్పీడ్ రైళ్లు.. 20 కొత్త జాతీయ జల మార్గాలు..
కేంద్ర బడ్జెట్ 2026-27లో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ దేశ అభివృద్ధి, యువశక్తిని ప్రధాన కేంద్రము చేసుకుని మూడు కర్తవ్యాల పద్ధతిలో ఆరు కీలక రంగాలలో పెద్ద నిర్ణయాలను తీసుకున్నారు. బడ్జెట్‌లో ప్రధానంగా పర్యావరణపరంగా స్థిరమైన రవాణా, పట్టణ, ఆర్థిక కేంద్రాల అభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం, MSMEs మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, దీర్ఘకాల భద్రత, నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాలను ప్రతిపాదించారు.
ప్రతిపాదిత 7 హై-స్పీడ్ రైలు కారిడార్లు (7 High Speed Rail Corridors) ముంబై-పుణే, పూణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి మార్గాల్లో అభివృద్ధి చెందుతాయి. ఇవి వృద్ధి కనెక్టర్లుగా పనిచేసి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ, ఉద్గారాలను తగ్గించగా, ప్రాంతీయ అభివృద్ధికి మద్దతు ఇస్తాయి. అలాగే పశ్చిమ బెంగాల్ డాంగ్‌కుని నుంచి సూరత్ వరకు కొత్త ప్రత్యేక సరుకు రవాణా కారిడార్డ్స్ ఏర్పాటు చేయబడతాయి. రాబోయే ఐదు సంవత్సరాల్లో 20 కొత్త జాతీయ జలమార్గాల కార్యాచరణ ద్వారా రవాణా సౌలభ్యం పెరుగుతుంది, ఇది రోడ్డు, రైలు కంటే ఇంధన సమర్థవంతమైనదిగా పరిగణించబడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.
ఆరు ప్రధాన నిర్ణయాలలో మొదట, 7 వ్యూహాత్మక, సరిహద్దు రంగాలలో తయారీ సామర్థ్యాన్ని పెంచడం ప్రధానంగా ఉంది. తద్వారా భారతీయ పరిశ్రమ సామర్థ్యాన్ని బలోపేతం చేసి, ఆర్థిక వ్యవస్థలో కీలకమైన స్థానాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది. రెండవ నిర్ణయం వారసత్వ పారిశ్రామిక రంగాలను పునరుద్ధరించడం, ఉద్యోగాలను కాపాడటం, ప్రాంతీయ వృద్ధికి మద్దతు ఇవ్వడం. మూడవది MSMEs వృద్ధి.. చిన్న, మధ్యతరహా వ్యాపారాల అభివృద్ధి ద్వారా ఉపాధి, ఆర్థిక స్థిరత్వం మరియు విస్తరణ.

నాల్గవది మౌలిక సదుపాయాలకు ప్రోత్సాహం.. ఇది స్వల్పకాలిక కార్యకలాపాలు మరియు దీర్ఘకాలిక ఉత్పాదకతకు పునాదిగా ఉంటుంది. ఐదవది.. దీర్ఘకాల భద్రత, స్థిరత్వం, ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని పెంపొందించడం. ఆరవది.. నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి, ఇవి పట్టణ కేంద్రాల వృద్ధికి, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు కీలకమైన పాత్ర పోషిస్తాయి.
ఇలాంటి ఆరు నిర్ణయాలు దేశం యొక్క ఆర్థిక వృద్ధి వేగాన్ని పెంచడంలో, యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టించడంలో, పరిశ్రమలకు, MSMEs కు మద్దతు ఇవ్వడంలో.. పర్యావరణపరంగా స్థిరమైన, సమగ్ర, సమానావకాశాల ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కీలకమైనవి. ఏదేమైనా Budget 2026-27 దేశ వ్యాప్తంగా రవాణా, పరిశ్రమ, MSMEs, మౌలిక సదుపాయాలు, భద్రత, నగర అభివృద్ధి వంటి అన్ని రంగాలలో సమగ్ర, స్థిరమైన, భవిష్యత్తుకి దోహదకరమైన ప్రణాళికను ప్రతిపాదిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications