భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోంది. అయితే ఈ అభివృద్ధికి విద్యుత్ అనేది ప్రధాన ఇంధనంగా ఉండబోతోంది. అందుకే పర్యావరణ మార్పుల నేపథ్యంలో మనం బొగ్గు వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించి, సౌర (Solar), పవన (Wind) ఇంధనాల వైపు మళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో రాబోయే బడ్జెట్ (Budget 2026) పునరుత్పాదక ఇంధన రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఎనర్జీ స్టోరేజ్: అసలు సవాలు ఇదే!
భారతదేశం పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచడంలో అద్భుతమైన ప్రగతి సాధించింది. కానీ, ఇక్కడ ఒక చిక్కు ఉంది. సూర్యుడు ప్రకాశించినప్పుడే సోలార్ విద్యుత్ వస్తుంది, గాలి వీచినప్పుడే పవన విద్యుత్ వస్తుంది. కానీ, మనకు 24 గంటల పాటు నిరంతరాయంగా పవర్ కావాలి. ఈ గ్యాప్‌ను భర్తీ చేయాలంటే 'బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్' (BESS) అత్యవసరం. నిల్వ సదుపాయం లేకపోతే మనం ఉత్పత్తి చేసిన గ్రీన్ ఎనర్జీ వృధా అవుతుంది. అందుకే ఈ బడ్జెట్(Budget 2026) లో బ్యాటరీ నిల్వ కేంద్రాల ఏర్పాటుకు, అలాగే పంప్డ్ హైడ్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి.
క్రిటికల్ మినరల్స్ , చైనాపై ఆధారపడటం
క్లీన్ ఎనర్జీ రంగంలో మరో ప్రధాన సమస్య 'క్రిటికల్ మినరల్స్'. బ్యాటరీల తయారీకి కావాల్సిన లిథియం, కోబాల్ట్ వంటి ఖనిజాల కోసం ప్రస్తుతం మనం చైనాపై ఎక్కువగా ఆధారపడుతున్నాం. గ్లోబల్ సప్లై చైన్‌లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించి, భారత్ స్వయంసమృద్ధి సాధించాలంటే దేశీయంగా ఖనిజాల వెలికితీత (Mining) , రీసైక్లింగ్ ను ప్రోత్సహించాలి. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ లిమిటెడ్ సీఈఓ అనురాగ్ చౌదరి వంటి నిపుణులు చెబుతున్న ప్రకారం.. దేశ ఇంధన భద్రతను కాపాడుకోవడానికి బడ్జెట్ లో ఈ ఖనిజాల అన్వేషణకు ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.
మేక్ ఇన్ ఇండియాకు ఊతం
ప్రస్తుతం మనం సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ సెల్స్ , పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి కీలక విడిభాగాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇది విదేశీ మారక ద్రవ్యంపై భారం చూపుతుంది. ఈ సారి బడ్జెట్ లో 'ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్' (PLI) పథకాన్ని మరింత పటిష్టం చేయడం ద్వారా దేశీయ తయారీదారులకు పెద్ద పీట వేయవచ్చు. తద్వారా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయి.
మొత్తానికి భారతదేశం 'నెట్ జీరో' లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచితే సరిపోదు, దానిని నిల్వ చేసే సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలి. ప్రభుత్వం ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో సరైన విధానాలను, సబ్సిడీలను ప్రకటిస్తే, భారత్ ప్రపంచ గ్రీన్ ఎనర్జీ మార్కెట్‌లో అగ్రగామిగా నిలవడం ఖాయం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications