భారతదేశం మరో కీలకమైన బడ్జెట్‌కు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రవేశపెట్టబోయే 2026 బడ్జెట్ (Budget 2026) పై సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ భారీ ఆశలే పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను (Income Tax) స్లాబులు తగ్గుతాయని, తమ చేతిలో నాలుగు రాళ్లు మిగులుతాయని ట్యాక్స్ పేయర్స్ ఆశిస్తున్నారు. అయితే ఆర్థిక నిపుణులు చెబుతున్న మాటలు వింటే ఈసారి మీకు నిరాశే ఎదురుకావచ్చు. ఎందుకంటే..

పెద్ద మార్పులు ఉండకపోవడానికి ప్రధాన కారణం!
ఈసారి బడ్జెట్ లో పెద్దగా పన్ను ఊరటలు ఉండకపోవడానికి ఒక బలమైన సాంకేతిక కారణం ఉంది. అదే "కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025" (New Income Tax Act, 2025). ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానుంది. దేశ చరిత్రలోనే అతిపెద్ద పన్ను సంస్కరణల్లో ఇది ఒకటి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇప్పటికే ఒక భారీ మార్పు ముంగిట ఉన్నాము. కాబట్టి ఈ బడ్జెట్ లో మళ్ళీ కొత్త అమెండ్‌మెంట్స్ లేదా ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు చేసే అవకాశం చాలా తక్కువ.
జీతం తీసుకునే వారికి ఊరట కష్టమేనా?
గత బడ్జెట్ లోనే కొత్త పన్ను విధానం (New Tax Regime) కింద స్లాబ్ రేట్లను ప్రభుత్వం సవరించింది. కాబట్టి సాలరీడ్ క్లాస్ (Salaried Employees) ఆశిస్తున్న మేజర్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఈసారి బడ్జెట్ (Budget 2026) లో లభించడం కష్టమని ఆర్థిక విశ్లేషకురాలు ముస్కాన్ కుక్రేజా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పుడు కొత్త చట్టాన్ని సజావుగా అమలు చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టనుంది.
ట్యాక్స్ విధానంలో సరళత.. పారదర్శకత
ఐఎంఐ ఢిల్లీ ప్రొఫెసర్ ప్రతీక్ బేడీ అభిప్రాయం ప్రకారం.. పన్ను రేట్లను తరచూ మార్చడం కంటే, ట్యాక్స్ విధానాన్ని సులభతరం చేయడం మరింత ముఖ్యం. ఈ సారి ప్రభుత్వం దానిపైనే ఫోకస్ చేయనుంది. ఈ సారి బడ్జెట్ లో ఎలాంటి మార్పులు ఉండొచ్చంటే..
- సింప్లిఫికేషన్: పాత, సంక్లిష్టమైన నిబంధనలను తొలగించి, పారదర్శకమైన ట్యాక్స్ కోడ్ ను తీసుకురావడం.
- ట్యాక్స్ నెట్ పెంపు: పాన్-ఆధార్ అనుసంధానం ద్వారా జిఎస్టి ట్రాకింగ్ ను పెంచడం, డిజిటల్ రసీదులను ప్రోత్సహించడం ద్వారా పన్ను పరిధిని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు.
బడ్జెట్ 2026 లక్ష్యం ఇదే!
ఈసారి బడ్జెట్ కేవలం ఉచిత పథకాలు లేదా రాయితీల చుట్టూ కాకుండా, దేశ ఆర్థిక పునాదులను బలోపేతం చేసే దిశగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో.. భారత్ తన వృద్ధి రేటును కాపాడుకుంటూనే, ద్రవ్యలోటును కట్టడి చేయాల్సి ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ ధీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఒక రోడ్ మ్యాప్‌లా ఉండబోతోంది.
ఏది ఏమైనా ఈసారి బడ్జెట్ (Budget 2026) అనేది నాటకీయ మార్పుల కంటే, వ్యవస్థలో స్థిరత్వం తెచ్చేదిగా.. అలాగే సమర్థవంతంగా అమలు చేయగలిగేదిగా ఉండనుంది. ప్రభుత్వం కూడా లాంగ్ టర్మ్ స్టెబిలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. ట్యాక్స్ పేయర్లు పెద్ద ఉపశమనం కోసం వచ్చే ఏడాది వరకు ఆగాల్సి రావొచ్చు.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications