మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ఏటా ఎదురుచూసే బడ్జెట్ (Budget 2026) సమయం రానే వచ్చింది. దేశ వ్యాప్తంగా సామాన్యుడు ఆశించేది ఒక్కటే.. తన చేతిలో నాలుగు రాళ్లు ఎక్కువ మిగలాలని. పెరిగిన ధరలు, పెరుగుతున్న వడ్డీ రేట్ల నేపథ్యంలో, ఈ సారి ప్రభుత్వం పన్ను స్లాబుల్లో మార్పులు చేసి సామాన్యుడికి భారీ ఊరటనిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆదాయపు పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండటంతో.. ప్రజలకు కొంత వెసులుబాటు కల్పించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హోమ్ లోన్ వడ్డీపై రాయితీ పెరగనుందా?
చాలా ఏళ్లుగా గృహ రుణ గ్రహీతలు ఒకే విన్నపం చేస్తున్నారు. ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీపై రూ. 2 లక్షల వరకు మాత్రమే మినహాయింపు ఉంది. కానీ, ప్రస్తుత రియల్ ఎస్టేట్ ధరలు, వడ్డీ రేట్లు చూస్తుంటే ఇది ఏ మూలకూ సరిపోవడం లేదు. అందుకే ఈ పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ సారి బడ్జెట్ (Budget 2026) లో ఈ నిర్ణయం తీసుకుంటే, మధ్యతరగతి ప్రజలకు ఇల్లు కొనాలనే కల మరింత సులభం అవుతుంది.
మహిళా పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం.. ఈ బడ్జెట్ లో మహిళా ఉద్యోగులకు లేదా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పన్ను మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలు మళ్లీ ఉద్యోగాల్లో చేరినప్పుడు వారికి పన్ను రాయితీలు ఇవ్వాలని, మహిళా స్టార్టప్ లకు తక్కువ పన్ను రేట్లు ఉండాలని ప్రతిపాదనలు అందుతున్నాయి.
పాత పన్ను విధానం (Old Tax Regime) మారుతుందా?
2017-18 నుండి పాత పన్ను విధానంలో స్లాబులు దాదాపుగా స్తంభించిపోయాయి. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పాత విధానాన్ని ఎంచుకునే వారికి కూడా ఊరటనివ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు, రిటైర్మెంట్ ఫండ్స్ (PF/Gratuity) విషయంలో డబుల్ ట్యాక్సేషన్ (రెండు సార్లు పన్ను పడటం) సమస్యను పరిష్కరించాలని సామాన్యులు కోరుకుంటున్నారు. రూ. 7.5 లక్షల కంటే ఎక్కువ కంపెనీ వాటా ఉంటే పడే పన్ను భారం తగ్గించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
మొబీల్ ఎంప్లాయీస్ కోసం కొత్త రూల్స్?
నేటి కాలంలో ఒకే కంపెనీలో పనిచేస్తూ వివిధ దేశాలకు లేదా రాష్ట్రాలకు వెళ్లే 'మొబీల్ ఎంప్లాయీస్' సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను చట్టం 2025లో వీరి పన్నుల విషయంలో కొన్ని స్పష్టత లేని అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈక్విటీ అవార్డులు, ఫారిన్ ట్యాక్స్ క్రెడిట్ విషయంలో ఈ సారి బడ్జెట్ (Budget 2026) స్పష్టమైన నిబంధనలు తీసుకువస్తే, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం మరింత సులభమవుతుంది.
మొత్తానికి ప్రభుత్వం పన్ను స్లాబులను విస్తరించడం ద్వారా సామాన్యుల కొనుగోలు శక్తిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు ఉంటే, అది ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచి, దేశ వృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక వేత్తల అభిప్రాయం.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications