త్వరలో రాబోతున్న బడ్జెట్ (Budget 2026) పై హెల్త్‌కేర్, ఫార్మా, ఇన్సూరెన్స్ రంగాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. పెరుగుతున్న వ్యాధులు, మారుతున్న జీవనశైలి నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి కేవలం చికిత్సకే కాకుండా, వ్యాధులు రాకుండా అడ్డుకునే 'ప్రివెంటివ్ కేర్' (Preventive Care) కు పెద్దపీట వేయాలని కోరుతున్నాయి.

వైద్య ఖర్చులు తగ్గించేలా టాక్స్ రిలీఫ్!
ప్రస్తుతం దేశంలో వైద్య ద్రవ్యోల్బణం (Medical Inflation) వేగంగా పెరుగుతోంది. దీనివల్ల సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం భారంగా మారుతోంది. ఈ క్రమంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D కింద ఇచ్చే మినహాయింపులను రెట్టింపు చేయాలని ఇన్సూరెన్స్ రంగానికి చెందిన నిపుణులు కోరుతున్నారు. పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం ద్వారా ఎక్కువ మంది ప్రజలు తమ కుటుంబాలకు తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందుకు వస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రివెంటివ్ హెల్త్ కేర్‌కు ప్రాధాన్యత
ఐసీఆర్ఏ (ICRA) నివేదిక ప్రకారం..ఈ బడ్జెట్ (Budget 2026) లో లైఫ్ స్టైల్ వ్యాధులను అరికట్టే దిశగా చర్యలు ఉండవచ్చు.
- టయర్-2, టయర్-3 పట్టణాలు: చిన్న నగరాల్లో మోడ్రన్ మెడికల్ ఫెసిలిటీస్ పెంచేలా ప్రైవేట్ ఇన్వెస్టర్లకు పన్ను రాయితీలు ఇవ్వాలి.
- మెడికల్ ఎడ్యుకేషన్: డాక్టర్లు, నర్సుల కొరతను తీర్చడానికి మెడికల్ ట్రైనింగ్ కు ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉంది.
ఫార్మా రంగం కోరుతున్న సంస్కరణలు
భారత్ 'ప్రపంచానికి మందుల గిడ్డంగి' గా పేరొందింది. కానీ, ముడి పదార్థాల (API) కోసం మనం ఇప్పటికీ విదేశాలపై ఆధారపడుతున్నాం. ఈ పరిస్థితిని మార్చడానికి పీఎల్ఐ (PLI) పథకాలను మరింత విస్తరించాలని ఫార్మా కంపెనీలు కోరుతున్నాయి. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) పై చేసే ఖర్చుకు పన్ను మినహాయింపును మళ్ళీ పునరుద్ధరించాలని ఈ బడ్జెట్ లో విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఏఐ (AI) & హెల్త్-టెక్ విప్లవం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్ సహాయంతో జబ్బులను ముందుగానే గుర్తించే టెక్నాలజీలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. శరీరానికి ధరించే హెల్త్ పరికరాలు (Wearables), రిమోట్ మానిటరింగ్ సిస్టమ్స్ ను ఇన్సూరెన్స్ ప్లాన్లలో భాగం చేయడం వల్ల దీర్ఘకాలంలో ప్రజల ఆరోగ్య ఖర్చులు తగ్గుతాయి. ఈ రకమైన స్టార్టప్‌లకు బడ్జెట్ లో ప్రోత్సాహకాలు లభిస్తాయని టెక్ రంగం ఆశిస్తోంది.
దేశీయంగా మెడికల్ పరికరాల తయారీ
సి.కె. బిర్లా హాస్పిటల్స్ సీఈఓ విపుల్ జైన్ అభిప్రాయం ప్రకారం.. మనం ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ మెడికల్ ఎక్విప్‌మెంట్ కోసం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఆటోమొబైల్ రంగంలాగే, హెల్త్ టెక్ రంగంలో కూడా మన దేశంలోనే భారీ స్థాయిలో వైద్య పరికరాలను తయారు చేస్తే సామాన్యులకు వైద్యం మరింత చౌకగా అందుతుంది.
ఏది ఏమైనా ఈసారి బడ్జెట్ (Budget 2026) కేవలం ఆసుపత్రుల నిర్మాణానికి మాత్రమే కాకుండా.. హెల్త్ కేర్ లో సాంకేతికత, దేశీయంగా హెల్త్ ఎక్విప్‌మెంట్ తయారీ అలాగే మధ్యతరగతి ప్రజలకు ఇన్సూరెన్స్ రాయితీలు ఇచ్చే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఎలా అమలు చేస్తుందో వేచి చూడాలి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications