Budget Stocks: మరో పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా మాదిరిగానే తన వార్షిక బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించనుంది. ఫిబ్రవరి 1, 2025న జరిగే ఈ సమావేశంలో కీలక రంగాలకు సంబంధించిన ప్రకటనల కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
అయితే మోదీ సర్కార్ 2025 వార్షిక బడ్జెట్లో ఏఏ రంగాలపై తన ఫోకస్ కొనసాగించనుందనే ఆసక్తి అందరిలోనూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనికోసం దేశీయ ఈక్విటీ ఇన్వెస్టర్లతో పాటు గ్లోబల్ ఇన్వెస్టర్లు సైతం పరిశీలిస్తున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్న వేళ మార్కెట్ల పనితీరు ఎలా ఉండనుందనే అంశం పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆయన నిర్ణయాలు సైతం బడ్జెట్ నిర్మాణాన్ని ప్రభావితం చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ప్రస్తుతం భారతీయ స్టాక్ మార్కెట్లలో చాలా కాలంగా కొనసాగుతున్న క్షీణతనుంచి తేరుకుంటూ రికవరీ కనిపిస్తోంది. బడ్జెట్ దగ్గరపడుతున్న వేళ పెట్టుబడిదారులు మార్కెట్లకు తిరిగి రావటం గమనిస్తున్నాం. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావటం కూడా శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఇవి మాంద్యం భయాలను నెమ్మదిగా తొలగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మార్కెట్లలో కొనసాగుతున్న బూమ్.. భారత మార్కెట్లకు వెన్నుగా నిలుస్తోంది. అలాగే ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు జరిగిన ఒప్పందం కూడా అంతర్జాతీయ మార్కెట్లకు మద్ధతుగా నిలుస్తోంది.
ఇదే సమయంలో లిక్విడిటీని పెంచటానికి రిజర్వు బ్యాంక్ వేరియబుల్ రెపో రేటును ప్రవేశపెట్టడం విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలను తగ్గించి మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించటంలో దోహదపడుతోంది. అయితే ఎఫ్ఐఐల నుంచి అమ్మకాల భయాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ షేర్లలో తిరిగి రికవరి కనిపిస్తోంది. పెద్ద ఆందోళన కలిగిస్తున్న అంశం మాత్రం పడిపోతున్న రూపాయి మారకపు విలువేనని మాత్రం ఒప్పుకోక తప్పదు.
బడ్జెట్ ఫోకస్డ్ రంగాలు..
2025 వార్షిక బడ్జెట్ ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనే అంశాన్ని పరిశీలిస్తే.. ముందుగా బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ షేర్లపై ఇన్వెస్టర్లు కన్నేసి ఉంచాలని తెలుస్తోంది. ఇదే క్రమంలో పవర్, ఇన్ ఫ్రా, రైల్వేలు, విద్యుత్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లను గమనించాల్సి ఉంటుంది. ఇక టెలికాం, ఐటీ రంగాలపై కూడా పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అధికంగా పెరిగిన షేర్లలో లాభాలను బుక్ చేసుకోవటానికి ప్రయత్నించటంతో పాటు కొత్త పెట్టుబడులకు కొంత దూరంగా ఉండటం ఉత్తమంగా మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications