Budget 2025: వేతన జీవులు ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం పన్ను రహిత ఆదాయాన్ని పెంచుతుందని భారీ ఆశలతో ఉన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కేవలం కొత్త పన్ను విధానం కింద మాత్రమే ఆదాయ పరిమితిని పెంచగా.. ప్రస్తుతం ఇది రూ.10 లక్షల వరకు పెంచబడుతుందని నివేదికలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పాత పన్ను విధానం శ్లాబ్ రేట్లలో కూడా పెంపులు ఉంటాయని వారు భావిస్తున్నారు.
అయితే ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టు మాత్రం దీనికి కొంత భిన్నంగా ఉంది. ఫిబ్రవరి 1, 2025న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రసంగంలో పాత పన్ను విధానం కింద అన్ని పన్ను మినహాయింపులు తొలగించబడతాయని ఎస్బీఐ సంచలన నివేదికను ప్రకటించింది. పాత పన్ను విధానం కింద ఉన్న వారిని సైతం ఈ క్రమంలో ప్రభుత్వం కొత్త విధానంలోకి మార్చుతుందని నివేదించింది. ఇదే క్రమంలో జాతీయ పెన్షన్ వ్యవస్థ పరిమితిని రూ.50,000 నుంచి రూ.లక్షకు పెంచాలని, సెక్షన్ 80డి కింద వైద్య బీమా మినహాయింపును రూ.25,000 నుంచి రూ.50,000కు పెంచాలని కూడా సిఫార్సు చేసింది.

ఇదే క్రమంలో 10-15 లక్షల మధ్య ఆదాయంపై పన్ను రేటును 15%కి తగ్గించాలని ఎస్బీఐ నివేదిక సూచించింది. అలాగే అన్ని బ్యాంకు డిపాజిట్లపై ఫ్లాట్ 15% పన్ను రేటును అమలు చేయాలని ప్రతిపాధించింది. ప్రజల చేతిలో ఖర్చుచేసేందుకు ఆదాయం ఎక్కువగా ఉండేందుకు వీలుగా పన్ను విధానాల్లో భారత ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో మార్పులను ప్రకటించవచ్చని తాము భావిస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. దీనిలో భాగంగానే అందరినీ కొత్త పన్ను విధానం కిందకు మూవ్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ చర్యలు కొంత మేర పన్ను ఆదాయాన్ని కేంద్రానికి తగ్గించవచ్చని అంచనా వేసింది.
ఇదే క్రమంలో ఎస్బీఐ సూచించిన మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. సేవింగ్స్ అకౌంట్లలో డిపాజిట్లపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.20,000కు పెంచాలని సూచించింది. పాత పన్ను విధానాన్ని రద్దు గురించి ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక ప్రకటనలు చేయలేదు. అయితే దీని భవిష్యత్తుపై నిపుణుల్లో చర్చ కొనసాగుతోంది. 2020 కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టబడిన కొత్త పన్ను విధానంలో మునుపటి వ్యవస్థలో ఇట్టిన పన్ను రాయితీలు, తగ్గింపులు లేకుండా తక్కువ పన్ను రేట్లను అందిస్తున్న సంగతి తెలిసిందే.
సెక్షన్లు 80C, 80D కింద ఉన్న వివిధ తగ్గింపులు, మినహాయింపుల కారణంగా చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ పాత వ్యవస్థను ఇష్టపడుతున్నారు. పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగించడం, కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్‌లను క్రమబద్ధీకరించడం ఒక తెలివైన పురోగతిని సూచిస్తుందని టాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రతినిధి వివేక్ జలాన్ పేర్కొన్నారు. కొత్త పన్ను విధానం కింద ప్రభుత్వం రూ.7 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండబోదని కంపెనీ వెల్లడించింది. అలాగే రూ.75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఉండటంతో రూ.7,75,000 వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను లేదు. మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు పన్ను ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications