పార్లమెంట్‌లో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల తేదీలను తాజాగా ప్రకటించారు. ఈ పార్లమెంటరీ సమావేశాలు 31 జనవరి 2025న ప్రారంభమై అలాగే ఏప్రిల్ 4న ముగుస్తాయి. ముఖ్యంగా బడ్జెట్ FY26 ప్రకటన ఫిబ్రవరి 1న జరుగుతుంది. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు సెషన్లుగా నివహించనున్నారు. మొదటి సెషన్ జనవరి 31న ప్రారంభమై 13 ఫిబ్రవరి 2025న వరకు అంటే రెండు వారాల పాటు కొనసాగుతుంది. రెండవ సెషన్ మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తుంది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 31 జనవరి 2025న న్యూఢిల్లీలో ఉదయం 11:00 గంటలకు లోక్‌సభ ఛాంబర్‌లో పార్లమెంట్ సమావేశంలో ప్రసంగిస్తారు. దీని తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన దేశంలో ఆర్థిక మంత్రిగా తన ఎనిమిదో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇప్పటివరకు ఆమె ఆరు అన్యువల్ బడ్జెట్‌లు ఇంకా రెండు ఇంటర్మ్ బడ్జెట్‌లను సమర్పించారు, దింతో భారతదేశంలో అత్యధిక బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలమ్మ అధిగమించారు.

యూనియన్ బడ్జెట్ 2025లో ఎం ఆశించవచ్చు?
యెస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఇంద్రనీల్ పాన్ మాట్లాడుతూ, "ఈ ఏడాది ఫైనాన్షియల్ మ్యానేజింగ్ పెద్ద సవాలుగా కనిపించడం లేదు. మరో బలమైన ఆర్‌బిఐ డివిడెండ్ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలకు మద్దతునిస్తుందని మా విశ్లేషణ సూచిస్తుంది. ఈ బడ్జెట్ స్వల్పకాలిక ఇంకా దీర్ఘకాలిక నిర్మాణ మార్పుల ద్వారా వృద్ధిని పెంచడంపై దృష్టి పెట్టాలి.
ప్రయివేటు పెట్టుబడులు నెమ్మదిగా సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయంపై దృష్టిని కొనసాగించే అవకాశం ఉంది. పట్టణ వినియోగ డిమాండ్ సాఫ్ట్ గా కనిపిస్తోంది ఇంకా గ్రామీణ డిమాండ్ కొంత నమ్మకం చూపుతున్నప్పటికీ తక్కువ-ఆదాయ వర్గాలకు కొంత ఉపశమనం కాకుండా మొత్తం వినియోగాన్ని పెంచడానికి పెద్దగా ప్రభుత్వ చర్యలు ఆశించడం లేదు."
"ఉపాధి కల్పన పథకాలను మెరుగుపరచడానికి ఇంకా గత సంవత్సరం ప్రకటించిన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను పెంచడానికి ప్రయత్నాలు చేయాలి. దీనికి అదనంగా వ్యవసాయ రంగం పై శ్రద్ధ అవసరం, ముఖ్యంగా వ్యవసాయ రంగం నుండి వాల్యూ చైన్ బలోపేతం చేయడం, వాతావరణ మార్పులో ఉత్పాదకతను మెరుగుపరచడం వంటివి చాలా ముఖ్యమైనవి." అని అన్నారు.
కేంద్ర బడ్జెట్ ఏమిటి?
కేంద్ర బడ్జెట్ అనేది భారత ప్రభుత్వం విడుదల చేసే ఫైనాన్షియల్ ప్రకటన, దీని ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఖర్చులను లెక్కిస్తుంది. యూనియన్ బడ్జెట్ అనేది తప్పనిసరిగా పేపర్స్ రూపంలో కూడా ఉంటుంది, ఇవి మొత్తం మీకు ప్రభుత్వ ఆర్థిక స్థాయి పై పూర్తి అవగాహన ఇస్తుంది. ప్రభుత్వం విధించే వివిధ పన్నుల గురించి స్పష్టమైన అవగాహన రావడానికి కూడా ఈ ఆర్థిక డాకుమెంట్స్ సహాయపడుతుంది. HDFC బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, మీరు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అన్ని బడ్జెట్ డాకుమెంట్స్ చూడవచ్చు.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications