కేంద్ర బడ్జెట్ 2025 Live Updates: శుక్రవారం ఉభయసభల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, దేశాన్ని ప్రగతి రంగంలో నడిపించిన అంశాలకు సంబంధించి ఉభయసభల్లో ఎకనామిక్ సర్వే రిపోర్టును ప్రవేసపెట్టడంతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల నుంచి వ్యాపారవేత్తల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అసలు రోజు వచ్చేసింది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోట్లాది ప్రజల భవితవ్యానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు. నేటి ప్రసంగంతో నిర్మలా సీతారామన్ మరో కొత్త రికార్డు నెలకొల్పటానికి సిద్ధమౌతున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ 3.0 ప్రభుత్వంలో రెండవసారి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇది ఆమె ప్రవేశపెట్టనున్న 8వ బడ్జెట్ కావటం గమనార్హం.
ఎన్డీఏ కూటమి కింద మోదీ ప్రభుత్వం కేంద్రంలో మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్న మెుదటి ఫుల్ టైం వార్షిక బడ్జెట్ సమావేశం కావటంతో కోట్లాది మంది కొత్త ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈసారి బడ్జెట్లో ప్రధానంగా సగటు వేతనజీవి కోరుకుంటోంది పన్ను మినహాయింపులే. ఆదాయాపు పన్ను పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచటం నుంచి క్యాపెక్స్ పెంపు వరకు వివిధ అంశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా శనివారం స్టాక్ మార్కెట్లకు ట్రేడింగ్ దినంగా ప్రకటించటంతో ఇన్వెస్టర్లు కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా రియాక్ట్ అవుతారు.
Feb 06, 2025, 3:32 pm IST
బడ్జెట్ తర్వాత పతనమైన స్టాక్ మార్కెట్లు
Feb 01, 2025, 4:03 pm IST
రైల్వేలు కాపెక్స్ తగ్గింపు, ఆదాయ ఆదాయం రూ.3 ట్రిలియన్లు దాటవచ్చు
రైల్వేలు కాపెక్స్ తగ్గింపు, ఆదాయ ఆదాయం రూ.3 ట్రిలియన్లు దాటవచ్చు
Feb 01, 2025, 4:03 pm IST
దేశంలో షిప్ బిల్డింగ్ క్లస్టర్ల ఏర్పాటు
దేశంలో షిప్ బిల్డింగ్ క్లస్టర్ల ఏర్పాటు
Feb 01, 2025, 4:03 pm IST
HMLలో చేర్చనున్న పెద్ద నౌకలు
HMLలో చేర్చనున్న పెద్ద నౌకలు
Feb 01, 2025, 4:01 pm IST
రూ.25,000 కోట్ల కార్పస్‌తో సముద్ర అభివృద్ధి నిధి ఏర్పాటు
రూ.25,000 కోట్ల కార్పస్‌తో సముద్ర అభివృద్ధి నిధి ఏర్పాటు
Feb 01, 2025, 4:01 pm IST
రాష్ట్రాలకు 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాలు
రాష్ట్రాలకు 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాలు
Feb 01, 2025, 3:58 pm IST
రక్షణ మంత్రిత్వ శాఖకు అత్యధికంగా కేటాయింపులు
రక్షణ మంత్రిత్వ శాఖకు అత్యధికంగా కేటాయింపులు
Feb 01, 2025, 3:58 pm IST
రక్షణ బడ్జెట్ కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లకు పెంపు
రక్షణ బడ్జెట్ కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లకు పెంపు
Feb 01, 2025, 3:58 pm IST
మొత్తం వ్యయంలో రూ.1.60 లక్షల కోట్లకు రక్షణ పెన్షన్ ఖాతా
మొత్తం వ్యయంలో రూ.1.60 లక్షల కోట్లకు రక్షణ పెన్షన్ ఖాతా
గృహ కొనుగోలుదారులు, గృహనిర్మాణ రంగానికి కీలక ఉపశమనం
గృహ కొనుగోలుదారులు, గృహనిర్మాణ రంగానికి కీలక ఉపశమనం
Feb 01, 2025, 3:53 pm IST
ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు
ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు
Feb 01, 2025, 3:51 pm IST
మోడిఫైడ్ ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ (MISS) కింద రుణ పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంపు
మోడిఫైడ్ ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ (MISS) కింద రుణ పరిమితిని రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంపు
Feb 01, 2025, 3:47 pm IST
వచ్చే దశాబ్దంలో ఇండియా 1,000 ఇన్సూరెన్స్ కంపెనీలను కలిగి ఉండవచ్చు
వచ్చే దశాబ్దంలో ఇండియా 1,000 ఇన్సూరెన్స్ కంపెనీలను కలిగి ఉండవచ్చు
Feb 01, 2025, 3:44 pm IST
స్టార్టప్‌ల కోసం రూ.10,000 కోట్ల ప్రత్యేక నిధుల కేటాయింపు
స్టార్టప్‌ల కోసం రూ.10,000 కోట్ల ప్రత్యేక నిధుల కేటాయింపు
Feb 01, 2025, 3:43 pm IST
ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డిఐ పరిమితి 74% నుంచి 100%కి పెంపు
ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డిఐ పరిమితి 74% నుంచి 100%కి పెంపు
Feb 01, 2025, 3:42 pm IST
ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డిఐ పరిమితి 100 శాతానికి పెంపు
ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డిఐ పరిమితి 100 శాతానికి పెంపు
Feb 01, 2025, 12:18 pm IST
మారిన కొత్త పన్ను విధానం కింద శ్లాబ్ రేట్లు
మారిన కొత్త పన్ను విధానం కింద శ్లాబ్ రేట్లు
రూ.0-4 లక్షలు - సున్నా
రూ.4-8 లక్షలు - 5%
రూ.8-12 లక్షలు - 10%
రూ.12-16 లక్షలు - 15%
రూ.16-20 లక్షలు - 20%
రూ.20-24 లక్షలు - 25%
రూ.24 లక్షల పైన 30 శాతం
Feb 01, 2025, 12:15 pm IST
వేతన జీవులకు పన్ను పరిమితి పెంపు
వేతన జీవులకు రూ.12.75 లక్షల ఆదాయంపై ఎలాంటి పన్ను లేదు
Feb 01, 2025, 12:13 pm IST
ఆదాయపు పన్ను మినహాయింపు రూ.12 లక్షలకు పెంపు
రూ.12 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ఆదాయపు పన్ను లేదని ప్రకటించిన నిర్మలమ్మ
Feb 01, 2025, 12:11 pm IST
సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు
NSS నుండి సీనియర్ సిటిజన్ ఉపసంహరణలకు పన్ను మినహాయింపు
Feb 01, 2025, 12:10 pm IST
36 ప్రాణాలను రక్షించే మందులకు ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుండి పూర్తి మినహాయింపు
Feb 01, 2025, 12:09 pm IST
వృద్ధులకు అద్దె ఆదాయం పన్ను పరిమితి పెంపు
వృద్ధులకు అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంపు
Feb 01, 2025, 12:08 pm IST
వృద్ధులకు టీడీఎస్ ఊరట
వృద్ధులకు టీడీఎస్ ఊరట వడ్డీ ఆదాయంపై రూ.50 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంపు
Feb 01, 2025, 12:07 pm IST
జ్ఞాన భారత మిషన్ కింద ఐఐటీ, ఐఐఎస్ విద్యార్థులకు రూ.10 వేల కోట్ల ఉపకార వేతనాలు
Feb 01, 2025, 12:07 pm IST
పన్ను రిటర్న్ ఫైలింగ్ కాల పరిమితి పెంపు
పాత ఆర్థిక సంవత్సరాలకు పన్ను ఫైల్ చేసేందుకు పరిమితిను 2 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెంపు
Feb 01, 2025, 12:05 pm IST
కొత్త ఆదాయపు పన్ను బిల్లు లిటిగేషన్ ఫ్రీ
కొత్త ఆదాయపు పన్ను బిల్లు అర్థం చేసుకోవడానికి సులభతరమని, లిటిగేషన్స్ తగ్గిస్తుందన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Feb 01, 2025, 12:04 pm IST
2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోలోటు అంచనా 4.4శాతం
Feb 01, 2025, 12:03 pm IST
వచ్చే ఆర్థిక సంవత్సరానికి నికర అప్పులు రూ.11.54లక్షల కోట్లు
Feb 01, 2025, 12:03 pm IST
ద్రవ్యలోటు జీడీపీలో 4.8 శాతంగా అంచనా
Feb 01, 2025, 12:03 pm IST
2024-25 ఆర్థిక సంవత్సరానికి సవరించిన వ్యయం రూ.47.16లక్షల కోట్లు
Feb 01, 2025, 12:02 pm IST
నష్టాల్లో సెన్సెక్స్-నిఫ్టీ
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
Feb 01, 2025, 12:01 pm IST
నిర్మలా సీతారామన్ క్యాపెక్స్ కేటాయింపుల తగ్గింపు
గత సంవత్సరంతో పోల్చితే క్యాపెక్స్ కేటాయింపులను 8.4% తగ్గించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Feb 01, 2025, 12:00 pm IST
క్యాపెక్స్ కోసం రూ.10.18 లక్షల కోట్ల: నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్ 2025 మూలధన వ్యయం కోసం ₹10.18 లక్షల కోట్లు కేటాయించింది.
Feb 01, 2025, 11:59 am IST
ఖనిజాల స్కాప్ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కోబాల్ట్ పౌడర్, లిథియం అయాన్ బ్యాటరీలు, మెర్కురీ, జింక్ మొదలైన ముఖ్యమైన ఖనిజాల వ్యర్థాలపై పూర్తి మినహాయింపును ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Feb 01, 2025, 11:54 am IST
వేగంగా కంపెనీల మెర్జర్ ప్రక్రియ పూర్తికి నిబంధనల విస్తరణ
వేగంగా కంపెనీల మెర్జర్ ప్రక్రియ పూర్తికి నిబంధనల విస్తరణ
Feb 01, 2025, 11:53 am IST
నేషనల్ మారిటైమ్ ఫండ్
ప్రభుత్వం, ప్రైవేటు పోర్టుల భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్
Feb 01, 2025, 11:53 am IST
రూ.25 వేల కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్
Feb 01, 2025, 11:52 am IST
వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లు
వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Feb 01, 2025, 11:51 am IST
వచ్చే వారం కొత్త ఆదాయపు పన్ను కోడ్
పన్ను శాఖ మొదట పన్ను చెల్లింపుదారులను విశ్వసిస్తుంది, తర్వాత పరిశీలిస్తుంది
Feb 01, 2025, 11:49 am IST
ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం FDI
ప్రస్తుతం ఇన్సూరెన్స్ రంగంలో 75 శాతం ఉన్న విదేశీ పెట్టుబడుల పరిమితి పెంచిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Feb 01, 2025, 11:48 am IST
బీహార్‌పై వరాల జల్లు
బీహార్‌లోని మిథిలాంచల్‌లో పశ్చిమ కోషి కెనాల్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది.
Feb 01, 2025, 11:47 am IST
దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు
Feb 01, 2025, 11:47 am IST
వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు
వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు
Feb 01, 2025, 11:46 am IST
టైర్-2 నగరాల్లో GCCల ఆకర్షణ
టైర్-2 నగరాల్లో GCCలను ప్రోత్సహించడానికి రాష్ట్రాలకు మార్గదర్శకంగా జాతీయ ఫ్రేమ్ వర్క్
Feb 01, 2025, 11:45 am IST
మెడికల్ టూరిజం కోసం వీసా రూల్స్ మార్పు
భారతదేశంలో మెడికల్ టూరిజం & హీల్, ప్రైవేట్ రంగంతో పాటు సులభతరం చేయబడిన వీసా నిబంధనలతో సహా ప్రోత్సహించబడతాయి.
Feb 01, 2025, 11:44 am IST
జల్ జీవన్ మిషన్ కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు
Feb 01, 2025, 11:43 am IST
ఎస్సీ-ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త స్కీమ్
ఎస్సీ-ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తల కోసం రానున్న ఐదేళ్లలో రూ.2 కోట్ల వరకు టర్మ్ లోన్లతో కొత్త స్కీమ్ ప్రారంభించనున్నారు.
Feb 01, 2025, 11:41 am IST
బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు
బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటు
Feb 01, 2025, 11:40 am IST
పట్టణ పేదల కోసం రూ.30 వేల పరిమితి కలిగిన యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు
Feb 01, 2025, 11:40 am IST
కొత్త ఉడాన్ స్కీమ్ కింద రానున్న 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పనే లక్ష్యం
కొత్త ఉడాన్ స్కీమ్ కింద రానున్న 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పనే లక్ష్యం
Feb 01, 2025, 11:39 am IST
క్లీన్టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం
క్లీన్టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం
Feb 01, 2025, 11:38 am IST
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఫోకస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్య కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు
Feb 01, 2025, 11:37 am IST
ప్రభుత్వం నౌకానిర్మాణంపై దృష్టి సారించినందున ఆర్థిక సహాయ స్కీమ్ పునఃప్రారంభం. రూ.25,000 కోట్ల కార్పస్‌తో సముద్ర అభివృద్ధి నిధి ఏర్పాటు.
Feb 01, 2025, 11:35 am IST
మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ 3 PPP ప్రతిపాదనలు
కాపెక్స్ కోసం రూ. 1.5 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలు
Feb 01, 2025, 11:34 am IST
2025-30 అసెట్ మానిటైజేషన్ ప్లాన్
2025-30 అసెట్ మానిటైజేషన్ ప్లాన్
Feb 01, 2025, 11:34 am IST
వికసిత్ భారత్ కోసం అణుశక్తి మిషన్
వికసిత్ భారత్ కోసం అణుశక్తి మిషన్: 100 GW అణుశక్తి
Feb 01, 2025, 11:33 am IST
రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్లు రుణం
కేంద్ర ప్రభుత్వ సంస్కరణ అమలుతో రాష్ట్రాలకు క్యాపెక్స్ కోసం రూ.1.5 లక్షల రుణాలను 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేకుండా
Feb 01, 2025, 11:31 am IST
బీహార్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ
బీహార్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ
Feb 01, 2025, 11:31 am IST
గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు
గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులతో పాటు పీఎం జన్ ఆరోగ్య యోజన కింద హెల్త్ ఇన్సూరెన్స్. కోటి మందికి ప్రయోజనం
Feb 01, 2025, 11:30 am IST
మెడికల్ సీట్లు పెంపు ప్రకటించిన నిర్మలమ్మ
వచ్చే ఏడాది 10,000 కొత్త వైద్య సీట్లు, ఐదేళ్లలో 75,000 కొత్త సీట్లు అదనంగా కల్పించబడతాయి
Feb 01, 2025, 11:28 am IST
విద్య కోసం రూ.500 కోట్ల వ్యయంతో AI పై 3 ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు
విద్య కోసం రూ.500 కోట్ల వ్యయంతో AI పై 3 ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు
Feb 01, 2025, 11:26 am IST
మొదటి సారి వ్యవస్థాపకులకు రూ.2 కోట్ల టర్మ్ లోన్ ఇవ్వబడుతుంది
మొదటి సారి వ్యవస్థాపకులకు రూ.2 కోట్ల టర్మ్ లోన్ ఇవ్వబడుతుంది
Feb 01, 2025, 11:25 am IST
పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్
పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్
Feb 01, 2025, 11:24 am IST
స్టార్టప్‌లకు రుణ సహాయం రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు
స్టార్టప్‌లకు రుణ సహాయం రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు
Feb 01, 2025, 11:24 am IST
MSME లకు రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు
MSME లకు రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు
Feb 01, 2025, 11:23 am IST
పాదరక్షలు & లెథర్ రంగాల కోసం ఫోకస్ ఉత్పత్తి స్కీమ్ 22 లక్షల మందికి ఉపాధి.
పాదరక్షలు & లెథర్ రంగాల కోసం ఫోకస్ ఉత్పత్తి స్కీమ్ 22 లక్షల మందికి ఉపాధి.
Feb 01, 2025, 11:22 am IST
MSME కోసం పెట్టుబడి పరిమితి 2.5 రెట్లు పెరుగుతుంది
MSME కోసం పెట్టుబడి పరిమితి 2.5 రెట్లు పెరుగుతుంది
Feb 01, 2025, 11:21 am IST
MSMEలకు క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించిన నిర్మలమ్మ
MSMEలకు క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించిన నిర్మలమ్మ
Feb 01, 2025, 11:20 am IST
భారతదేశాన్ని స్థిరమైన బొమ్మల ప్రపంచ కేంద్రంగా మార్చడంపై దృష్టి పెట్టిందన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Feb 01, 2025, 11:18 am IST
నాణ్యమైన పత్తి కోసం అదనపు లాంగ్ స్టేపుల్ కాటన్ రకాలకు సహాయం చేయడానికి 5 సంవత్సరాల పాటు పత్తి ఉత్పాదకత కోసం మిషన్
Feb 01, 2025, 11:15 am IST
ధన్ ధన్య కృషి యోజన 100 తక్కువ ఉత్పాదకత జిల్లాలపై దృష్టి సారిస్తుంది
ధన్ ధన్య కృషి యోజన 100 తక్కువ ఉత్పాదకత జిల్లాలపై దృష్టి సారిస్తుంది
Feb 01, 2025, 11:14 am IST
కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు
Feb 01, 2025, 11:11 am IST
బీహార్ లో మకానా బోర్డు ఏర్పాటు ప్రకటించిన ఆర్థిక మంత్రి
Feb 01, 2025, 11:11 am IST
ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించిన కేంద్రమంత్రి
ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించిన కేంద్రమంత్రి
Feb 01, 2025, 11:07 am IST
వేగంగా భారత్
ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో మన ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది
Feb 01, 2025, 11:05 am IST
దేశ ప్రజలపై పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Feb 01, 2025, 11:05 am IST
రెతులు, మహిళలు, యువత టార్గెట్ గా బడ్జెట్
Feb 01, 2025, 11:04 am IST
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న ఆర్థిక మంత్రి- తెలుగు రచయిత గురజాడ అప్పారావు చెప్పిన మాటలు
Feb 01, 2025, 11:04 am IST
వృద్ధిని పెంచడానికి బడ్జెట్లో దృష్టి పెట్టినట్లు చెప్పిన ఆర్థిక మంత్రి
Feb 01, 2025, 11:02 am IST
ప్రతిపక్ష నేతల ఆందోళనల మధ్య స్టార్ట్ అయిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం స్టార్ట్
Feb 01, 2025, 11:01 am IST
ఉభయసభలు ప్రారంభం కాగానే ఆందోళన స్టార్ట్ చేసిన ప్రతిపక్షాలు
Feb 01, 2025, 11:01 am IST
బడ్జెట్ ప్రసారాలు ప్రారంభం
లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రసారాలు ప్రారంభం
Feb 01, 2025, 10:59 am IST
నిర్మలమ్మ బడ్జెట్ కు గ్రీన్ సిగ్నల్
బడ్జెట్ సమర్పణకు ముందు పార్లమెంటులో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రివర్గం 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనకు ఆమోదం
Feb 01, 2025, 10:54 am IST
బడ్జెట్ ప్రజలను నిరాశపరచకూడదు: సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్
Feb 01, 2025, 10:52 am IST
నేటి బడ్జెట్లో ఆదాయపు పన్ను ఉపశమనం, దిగుమతులపై పన్ను తగ్గింపు చర్యలు పట్టణ వినియోగదారులకు ఉపశమనం అందిస్తాయంటున్న నిపుణులు
Feb 01, 2025, 10:50 am IST
జైరామ్ రమేష్ సంచలన కామెంట్స్
మోదీ ప్రభుత్వం టాక్స్ టెర్రరిజం నుంచి పెట్టుబడిదారులకు ఉపశమం ఇస్తుందేమో ఈ బడ్జెట్లో చూడాలి- కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్
Feb 01, 2025, 10:49 am IST
బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతన్నలకు, దేశయువతకు కీలక ప్రకటనలు చేసే అవకాశం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు.
Feb 01, 2025, 10:45 am IST
2047 నాటికి దేశంలో అందరికీ బీమా సౌకర్యం కిందకు తీసుకురావాలని ప్రభుత్వ ప్రయత్నం. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ చట్టానికి మార్పులు ప్రకటించే అవకాశం
Feb 01, 2025, 10:43 am IST
ఇంట్రాడేలో బడ్జెట్ ముందు లాభాల్లో కొనసాగుతున్న బ్యాంకింగ్ స్టాక్స్
Feb 01, 2025, 10:40 am IST
న్యూ ఎనర్జీ రంగం విధానపరమైన మార్పులతో పాటు ప్రోత్సాహకాలు, ముడి పదార్థాలపై సుంకాల తగ్గింపు కోరుకుంటున్నారు
Feb 01, 2025, 10:38 am IST
ప్రభుత్వం హైవే బడ్జెట్‌ను 5-6% పెంచే అవకాశం
బడ్జెట్లో రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.2.90 లక్షల కోట్ల వరకు నిధుల కేటాయింపు అవకాశం
Feb 01, 2025, 10:34 am IST
ప్రతికూలతల్లోనూ భారత్ ముందుకే
#WATCH | #UnionBudget2025 | Union Parliamentary Affairs Minister Kiren Rijiju says, "The country has witnessed that despite world-facing multiple issues, India's economy is growing and the country is moving ahead. Nirmala Sitharaman is going to present her record number (8th) of… pic.twitter.com/Ow7mGEnSng
ప్రపంచం సవాళ్లతో కూడుకున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది- కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
Feb 01, 2025, 10:32 am IST
పార్లమెంటుకు చేరుకున్న రక్షణ మంత్రి
సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన బడ్జెట్ అన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Feb 01, 2025, 10:28 am IST
#WATCH | #UnionBudget2025 | Mumbai: Sheetal Kalro, Deputy Director General, IMC Chamber of Commerce and Industry says, "There are a lot of expectations with the Budget. This Budget will have a lot of focus on farmers, youth, women, common man and salaried employees...Government… pic.twitter.com/glIwWRzEpT
వీడియో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నివాసం నుంచి మారుతీ సియాజ్ కారులో భద్రతా దళాలతో కలిసి ఆర్థిక మంత్రిత్వ శాఖకు వెళుతున్నారు.
Feb 01, 2025, 9:43 am IST
మధుబని కళతో చీర కట్టిన నిర్మలమ్మ:
రంగురంగుల మధుబని నమూనాతో బోర్డర్ ఉన్న నిర్మల సీతారామన్ చీర భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి అందమైన ప్రాతినిధ్యం వహించింది. మధుబని కళ అనేది బీహార్‌లోని మిథిలా ప్రాంతం నుండి వచ్చిన సాంప్రదాయ జానపద కళారూపం. ఇందులో శక్తివంతమైన రంగులు, సున్నితమైన గీతలు, ప్రతీకాత్మక ప్రాతినిధ్యాలను కలిగి ఉంది.
Feb 01, 2025, 9:37 am IST
పద్మ అవార్డు గ్రహీత దులారీ దేవి ప్రతిభను గౌరవించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చీర ధరించారు.
Feb 01, 2025, 9:21 am IST
బడ్జెట్ ప్రసంగానికి సంసిద్ధం
Delhi: Union Finance Minister Nirmala Sitharaman is all set to present #UnionBudget2025 in the Parliament today.
She will present and read out the Budget through a tab, instead of the traditional 'bahi khata'. pic.twitter.com/Iky9TSOsNW
రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటుకు చేరుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Feb 01, 2025, 8:51 am IST
ప్రధాని మోదీ ప్రార్థన:
దేశంలోని పేద మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ సంపదలను ఇంచ్చే లక్ష్మీదేవిని ప్రార్థించటం ఆదాయపు పన్ను ఉపశమనంపై అంచనాలు పెంచుతోంది.
Feb 01, 2025, 8:49 am IST
బడ్జెట్ ఫోకస్ ఈ అంశాలపైనే:
ఈ బడ్జెట్లో అందరి చూపు ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు మందగమనం, ఉపాధి, ఆదాయపు పన్ను, మధ్యతరగతి ప్రజల జేబులు నింపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశాలపై అందరి చూపు కొనసాగుతోంది
Feb 01, 2025, 8:47 am IST
నిర్మలా సీతారామన్ 2024 జూలైలో రూ. 48.21 లక్షల కోట్ల బడ్జెట్‌ను సమర్పించారు.
Feb 01, 2025, 8:37 am IST
మరికొంత సమయంలో బడ్జెట్ కాపీతో రాష్ట్రపతిని కలవనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Feb 01, 2025, 8:35 am IST
బడ్జెట్లో వృద్ధికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రాధాన్యత ఇస్తారనే సానుకూల ధోరణితో పెట్టుబడిదారులు ట్రేడింగ్ కొనసాగించటంతో భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం వరుసగా నాలుగో రోజు లాభాలను నమోదు చేశాయి.
Feb 01, 2025, 8:32 am IST
Stock Market: నేడు శనివారమైన దేశీయ స్టాక్ మార్కెట్ల స్పెషల్ ట్రేడింగ్. బడ్జెట్ ప్రసంగం ఉండటంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పూర్తిస్థాయిలో సాధారణ రోజు మాదిరిగానే పనిచేస్తాయి.
Feb 01, 2025, 8:29 am IST
బడ్జెట్ సమర్పణ సమయం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2025 బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
Feb 01, 2025, 7:39 am IST
ఇన్సూరెన్స్ రంగంపై నిపుణుల అభిప్రాయం
పెరుగుతున్న కస్టమర్ అంచనాలు, సాంకేతిక పురోగతి- నియంత్రణ సంస్కరణల ద్వారా భారతీయ బీమా రంగం ఒక డైనమిక్ పరివర్తనకు లోనవుతోంది- హనుత్ మెహతా, బీమాపే ఫిన్సర్ సీఈవో
Jan 31, 2025, 1:20 pm IST
ఇన్సూరెన్స్ రంగం:
2024 పరివర్తన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తూ 2025 కోసం ఎదురుచూస్తూ భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ రంగం స్థిరమైన వృద్ధి ప్రోత్సాహాన్నిచ్చిందని అగేస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, ఈసీవో జూడ్ గోమ్స్ పేర్కొన్నారు.
Jan 31, 2025, 1:20 pm IST
బడ్జెట్ 2025 అంచనాలు:
నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నుంచి కోరుతున్న ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే..
- పన్ను సంస్కరణలపై దృష్టి
- క్యాపెక్స్ కోసం ఎక్కువ కేటాయింపులు
- పన్ను శ్లాబ్ రేట్లలో మార్పులు
- స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
- విదేశీ పెట్టుబడుల ఆకర్షణ
- ప్రొడక్షన్ లింక్డ్ ప్రయోజనాలు