కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టనున్న సంగతి మీకు తెలిసందే. అయితే భారతదేశంలోని మధ్యతరగతి, ముఖ్యంగా జీతాలు పొందే వారికీ ఈ బడ్జెట్ పై ఎక్కువ అంచనాలు ఉంటాయి. మధ్యతరగతి కుటుంబాలు బడ్జెట్ సమయంలో ఆర్థిక భారాన్ని తగ్గించే చర్యలు ఇంకా మంచి జీవనం(cost of living) అందించే చర్యల కోసం ఆసక్తిగా
చూస్తుంటారు.
మధ్యతరగతి అనేది దేశ జనాభా మాత్రమే కాదు, దేశ వెన్నుముక్కకి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇంకా ఆర్ధిక స్థోమత ఇంకా అవకాశాల మధ్య వీరు కలలు కంటుంటారు. మధ్యతరగతి ఎక్కువగా కోరుకునే వాటిలో మొదట ఆదాయపు పన్ను రేట్ల తగ్గింపు ఉంటుంది. పెరుగుతున్న ఖర్చులతో జీతం పొందే వారి చేతుల్లో కొంత డబ్బు మిగిలితే వాటిని సేవింగ్స్ చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి ఇంకా అవసరమైన ఎమర్జెన్సీ ఖర్చుల కోసం చూస్తారు.

బడ్జెట్ 2025 అంచనాలు: పెరుగుతున్న ఖర్చుల నుండి రిలాక్సేషన్
ద్రవ్యోల్బణం నిత్యావసర ఖర్చులను ప్రభావం చేయడంతో మధ్యతరగతి కుటుంబాలు జీవన వ్యయాన్ని తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో విద్య, ఆరోగ్య సేవలు, రవాణా రంగాలలో సబ్సిడీలు లేదా సహాయం ఉన్నాయి.
అధిక HRA & స్టాండర్డ్ డిడక్షన్
ఇంటి నిర్మాణం, నిత్యావసర ఖర్చులు మధ్యతరగతి బడ్జెట్‌లో పెద్ద భాగం. హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) మినహాయింపు అండ్ స్టాండర్డ్ డిడక్షన్‌కి సవరణలు ఈ ఖర్చులను పరిష్కరించడంలో చాలా వరకు సహాయపడతాయి, ఇంకా దీని వల్ల చాలా అవసరమైన ఫైనాన్సియల్ రిలీఫ్ అందిస్తుంది.
అందుబాటు ధరలకే ఇల్లులు
సొంత ఇల్లు అనేది చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు ఒక గొప్ప కల. హౌస్ లోన్ మరింతగా అందుబాటులోకి తీసుకురావడం అలాగే మొదటిసారి ఇంటిని కొనేవారికి ప్రోత్సాహక పాలసీలను అందించడం ఇలాంటివి మధ్యతరగతి కోరికల లిస్టులో ఎప్పుడు ఉంటాయి.
సేవింగ్స్ అవకాశాలలో పెరుగుదల
రిటైర్‌మెంట్ ఫండ్స్‌లో పెట్టుబడులను ప్రోత్సహించే విధానాలు, అధిక పన్నులు లేకుండా విద్య, ఆరోగ్య సంరక్షణతో సహా మెరుగైన సేవింగ్స్ అవకాశాల గురించి మధ్యతరగతి కలలు కంటుంది. సేవింగ్స్ అనేది ఆర్థిక భద్రతకు మూలస్తంభం ఇంకా ఇక్కడ మెరుగుదలలు గొప్ప ప్రభావాన్ని చూపుతాయి.


Click it and Unblock the Notifications