Ambani-Adani: నిన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య, మధ్యతరగతి ప్రజలను ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చర్చంతా ఇది అంబానీ, అదానీ వంటి వ్యాపారవేత్తలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందనేదే. దీని గురించి తెలుసుకునేందుకు ఇప్పటికే ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బడ్జెట్ రోజున దేశీయ స్టాక్ మార్కెట్‌లో భారీ హెచ్చుతగ్గులు భారతీయ బిలియనీర్ల సంపదపై కూడా ప్రభావం చూపాయి. సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీల్లో లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు బడ్జెట్ రోజున నష్టపోయాయి. మార్కెట్లలో లాభపడిన షేర్ల యజమానాలపై కాసుల పంట కురియగా, నష్టపోయిన స్టాక్స్ తమ యజమానుల విలువను తగ్గించాయి.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం నిన్న టాప్-10 బిలియనీర్లలో కేవలం ముగ్గురు మాత్రమే తమ సంపదలో క్షీణతను చూశారని వెల్లడైంది. ఈ క్రమంలో ముందుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అందరికంటే ఎక్కువగా భారీ నష్టాన్ని చూశారు. రిలయన్స్ స్టాక్ బడ్జెట్ రోజున పతనం కావటంతో ఆయన సంపద 1.10 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయి అంబానీ విలువ 112 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక నష్టాల్లో రెండవ స్థానంలో అజీమ్ ప్రేమ్ జీ నిలిచారు. ఈయనకు చెందిన విప్రో షేర్లలో పతనం నికర విలువలో 123 మిలియన్ డాలర్ల పతనాన్ని కలిగించి 28.4 బిలియన్ డాలర్లకు చేరుకునేలా చేసింది. ఇక నష్టపోయిన వారిలో చివరి స్థానంలో కుమార మంగళం బిర్లా 200 మిలియన్ డాలర్ల సంపద కోల్పోయి 22.2 బిలియన్ డాలర్ల సంపదతో మిగిలారు.
బడ్జెట్ విన్నర్ అదానీ..!!
ఇక నిర్మలమ్మ బడ్జెట్ ప్రధానంగా గౌతమ్ అదానీని సంతోషంలో ముంచేసిందని చెప్పుకోవచ్చు. అదానీ సంపద మంగళవారం 751 మిలియన్ డాలర్లు పెరిగి నికర విలువ 102 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. అలాగే షాపూర్ మిస్త్రీ సంపద 219 మిలియన్ డాలర్లు పెరిగి 40.50 బిలియన్ డాలర్లకు చేరుకుంది. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌కు చెందిన శివ్ నాడార్ బడ్జెట్ రోజున 409 మిలియన్ డాలర్లు సంపాదించి నికర విలువను 37.2 బిలియన్ డాలర్లకు పెంచుకున్నారు.
JSW స్టీల్ యజమాని సావిత్రి జిందాల్ సంపద 10.5 మిలియన్ డాలర్లు పెరిగి 33.7 బిలియన్ డాలర్లుగా మారింది. దిలీప్ షాంఘ్వీ నికర విలువ 264 మిలియన్ డాలర్లు పెరిగి 26.1 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. ఇక డీమార్ట్ రిటైల్ స్టోర్ల అధినేత రాధాకిషన్ దమానీ సంపద నిన్న ఒక్కరోజు 234 మిలియన్ డాలర్లు పెరిగి 24 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక లిస్టులో చివరిగా ఉన్న సునీల్ మిట్టల్ సంపద స్వల్పంగా 4 మిలియన్ డాలర్లు మాత్రమే పెరిగటంతో మెుత్తం సంపద 23.2 డాలర్లకు చేరుకుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications