Budget 2024 Decoded: బడ్జెట్ ప్రసంగం 2024 పెద్ద రసాభాసగా మారింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాల పేర్లు పలకటం ఇతర రాష్ట్రాల నేతల ఆగ్రహానికి కారణమైంది. అయితే ఇక్కడ నిర్మలా సీతారామన్ తన చతురతను ప్రదర్శించటం చివరికి అందరినీ షాక్ కి గురిచేస్తోంది.
వాస్తవానికి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో రూ.15,000 కోట్లను వివిధ సంస్థల ద్వారా పొందేందుకు సహాయం చేస్తుందంది అని చెప్పారు. కానీ ఇది విన్న అందరూ బడ్జెట్లో నేరుగా డబ్బు కేటాయించింది అని భ్రమపడ్డారు. ఇదే సమయంలో బిహార్ కోసం బడ్జెట్లో రూ.26,000 కోట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. ఇక్కడ ఏపీకి నిధులు సమకూర్చేందుకు సహాయాన్ని అందరూ కేంద్రం నుంచి నిధులుగా పొరపాటు పడ్డారు. మెుత్తానికి కూటమిలో ఉన్న ఏపీకి సైతం మోదీ సర్కార్ 3.0 తొలి బడ్జెట్ చిల్లిగవ్వ రాల్చలేదు. ఇది చూసిన చాలా మంది ప్రస్తుతం ఐస్ చూపించి పుల్ల చేతిలో పెట్టింది కేంద్ర ప్రభుత్వం అని అంటున్నారు.

వాస్తవానికి ఏపీలో బీజేపీ ప్రభుత్వం చంద్రబాబుపై నమ్మకం కంటే పవన్ పై ఫోకస్ పెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరోపక్క చంద్రబాబు మాత్రం సమయానుకూలంగా ప్రతి సందర్భంలోనూ పవర్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది జనసేనను కంట్రోల్ చేసేందుకేనా అనే అనుమానాలను రాజకీయ పండితులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఏపీలో లోకేష్ చరిష్మాకు దెబ్బతీస్తుందనే వాదనలు సైతం టీడీపీ కేడర్ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఇక రాజకీయాలను పక్కన పెడితే బిహార్ రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో అధికారంలోకి రావటానికి సహాయపడిన నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బడ్జెట్ వరాల జల్లు కురిపించిందని తెలుస్తోంది.
అయితే చాలా మంది బీజేపీ సర్కార్ ప్రకటనలను కేవలం పేపర్లకే పరిమితం చేస్తుందా లేక ఆచరణలో వాటిని ఇస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ నితీష్ కుమార్ ప్రభుత్వం బిహార్ లో గెలవక పోతే ప్రకటించిన రూ.26,000 కోట్లు సైతం అందించే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి.
మెుత్తానికి 2024 వార్షిక బడ్జెట్ నిజంగా మాట్లాడుకుంటే ఏ రాష్ట్రానికీ ఎలాంటి ఆర్థిక ప్రయోజనాన్ని అందించలేదని విస్పష్టం. ఇది పూర్తిగా బీజేపీ తన రాజకీయ చదరంగంలో అన్ని రాష్ట్రాలు బలయ్యాయని తెలుసుకోవటానికి కొంత సమయం పడుతుంది. గతంలో బిహార్ కు లక్షల కోట్లు ప్రకటించిన మోదీ వాటిని నిజంగా ఇచ్చారో లేదో అందరికీ తెలిసిందే అంటూ ప్రస్తుత బడ్జెట్ పై విశ్లేషకులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.


Click it and Unblock the Notifications