Budget 2022: లక్షల ఉద్యోగాలు వచ్చాయ్, త్వరలో ఎల్ఐసీ ఐపీవో
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 ఉదయం గం.11 సమయానికి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. నిర్మలమ్మకు ఇది నాలుగో బడ్జెట్ కాగా, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి 10వ బడ్జెట్. వరుసగా రెండోసారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రజలకు యాప్‌లో అందుబాటులో ఈ బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ ప్రారంభంలోనే ఆమె ఒమిక్రాన్, వ్యాక్సినేషన్ గురించి మాట్లాడారు. కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా ఉపయోగపడిందని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఉపయోగపడిందని తెలిపారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఉపయోగపడిందన్నారు.
వచ్చే పాతికేళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్నారు. పేద, మధ్య తరగతి సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో 16 లక్షల ఉద్యోగాలు సృష్టించినట్లు తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ వేగంగా కొనసాగుతోందన్నారు. నీలాంచల్ నిస్పత్ లిమిటెడ్‌ను ప్రయివేటీకరించినట్లు తెలిపారు. ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాలతో 14 రంగాల్లో వృద్ధి కనిపించిందని తెలిపారు. పారదర్శక సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్ పునాది అన్నారు.

భారత ఆర్థిక వృద్ధి రేటు 9.27 శాతంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు నిర్మలమ్మ. అధిక వ్యాక్సినేషన్ కారణంగా భారత్ మంచి స్థాయిలో ఉందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. PLI స్కీమ్ ద్వారా పద్నాలుగు రంగాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు. ఎల్ఐసీ ఐపీవో త్వరలో రానుందన్నారు. గృహ, వసతులు, తాగునీటి కల్పనలో దేశం వేగంగా ముందుకు సాగుతోందన్నారు. వచ్చే అయిదేళ్లలో 13 లక్షలకోట్ల ఉత్పత్తికి తగిన ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు.


Click it and Unblock the Notifications