కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్‌లో భారత స్టార్టప్స్ ఎన్నో ఆశలతో ఉన్నాయి. కరోనా సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది రెండో బడ్జెట్. వరుస లాక్ డౌన్‌లు, ఆంక్షల మధ్య పారిశ్రీమిక, వాణిజ్య రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నిలదొక్కున్న వాటిలో వ్యవసాయం, ఐటీ, స్టార్టప్స్ మాత్రమే. ఈ పరిస్థితుల్లో స్టార్టప్స్‌కు మరింత ఊతమిచ్చే చర్యలు ఏం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తమ పైన విధించే పన్ను భారాన్ని తగ్గించాలని స్టార్టప్స్ ఇండస్ట్రీ విజ్ఞప్తి చేస్తోంది.

స్టార్టప్స్ ఏం కోరుకుంటున్నాయి
కరోనా సమయంలో స్టార్టప్స్ నిలదొక్కుకున్నప్పటికీ, మరింత ఊతమివ్వడానికి బడ్జెట్ పైన ఆశాజనకంగా ఉన్నాయి. ఇన్నోవేషన్స్ పైన కొత్త స్టార్టప్స్ ఫ్రెండ్లీ పాలసీలు, ట్యాక్స్ రిలాక్సేషన్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాంప్లియెన్స్ ఖర్చుల తగ్గింపు సహా వివిధ ప్రయోజనాలు కేంద్ర బడ్జెట్ 2022-23లో కల్పించాలని స్టార్టప్స్ గ్రూప్ కోరుతోంది.
స్టార్టప్స్ ప్రోగ్రెసివ్ బడ్జెట్ కోసం చూస్తున్నాయని, సమస్యలను పరిష్కరించే దేశీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలన్నారు. బ్యూరోక్రటిక్ సమస్యలు తలెత్తకుండా, తమ వ్యాపారాలను నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం వ్యవస్థాపకుల కోసం సరళ నియంత్రణ నిర్మాణం, చట్టాలు, ప్రమాణాలను రూపొందించాలని కోరుతోంది.

ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం పొడిగింపు
స్టార్టప్స్ వృద్ధికి సహకరించే ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (FFS)కు ప్రభుత్వ సహకారాన్ని పెంచాలని కోరుతున్నాయి. ఈజీ లోన్ డిస్ట్రిబ్యూషన్, పన్ను, కంప్లియెన్స్ ఆటోమేషన్, పేపర్‌లెస్ అప్రూవల్, డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా విస్తృతికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS)ను వచ్చే ఆర్థిక సంవత్సరానికి పొడిగించడం, విస్తరించడాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరుతోంది. వీటిపై వడ్డీ రేట్లు పరిమితం కాకూడదని, అలా అయితే మైక్రో-స్కేల్ ఎంటర్‌ప్రైజెస్‌కు నిధులను అందుబాటులో ఉంచేలా ప్రోత్సహిస్తుందని చెబుతోంది.

ఈవీ ప్రోత్సాహం కోసం
స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు గత సంవత్సరం ప్రభుత్వం స్టార్టప్ ట్యాక్స్ వెకేషన్ క్లెయిమ్‌ను 31 మార్చి 2022 వరకు పొడిగించింది. స్టార్టప్ ఇన్వెస్ట్‌మెంట్ క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపును మార్చి 31, 2022 వరకు పొడిగించింది. చాలా స్టార్టప్స్ గత ఏడాది ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ స్కీమ్స్(ESOP) కొనుగోలు చేసేలా ప్రోత్సహించాయి. వీటిపై ఆదాయపు పన్ను తొలగించాలని కోరుతోంది.
స్థానిక ఎలక్ట్రానిక్ కార్ల తయారీని ప్రోత్సహించేందుకు, ఫైనాన్సింగ్‌ను సులభతరం చేయడానికి, ఈవీ స్నేహపూర్వక వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కొత్త దశలను ఆవిష్కరించాలని స్టార్టప్స్ కోరుతున్నాయి. ఈవీ రంగం స్టార్టప్స్ ఈవీ కొనుగోళ్లు, అద్దెలపై జీఎస్టీని 5 శాతం నుండి 2 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. జీఎస్టీ తగ్గింపు ద్వారా ఈవీలకు మారడానికి కస్టమర్లను సులభంగా ఒప్పించవచ్చునని చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications