కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఫిబ్రవరి 1, మంగళవారం) 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. కరోనా మహమ్మారి, ఆర్థిక క్షీణత, ఆదాయాలు తగ్గడం వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. 2019లో మందగమనం, 2020 నుండి కరోనా ప్రపంచాన్ని, భారత్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందు ఉండటం మాత్రమే ఊరట. కానీ కరోనా పేద, సామాన్యుడి జీవితంపై పెను ప్రభావం చూపింది. క్లిష్ట పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలమ్మ ముందు పలు సవాళ్లున్నాయి.

ద్రవ్యోల్భణం సవాల్
ద్రవ్యోల్భణం పెరుగుదలతో ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కూరగాయల నుండి అంతర్జాతీయ పెరుగుదలతో పెట్రోల్ వరకు అన్ని ధరలు భారీగా పెరిగాయి. డిసెంబర్ నెలలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 5.59 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్భణాన్ని 4 శాతం వద్ద స్థిరీకరించాలని ప్రభుత్వం లక్ష్యం కాగా సాధ్యం కాలేదు. అయితే ఆర్బీఐ టార్గెట్ 2 శాతం నుండి 4 శాతం మధ్య ఉంది.
చమురు ధరలు 90 డాలర్లకు చేరుకున్నాయి. ఇవి త్వరలో 100 డాలర్లకు చేరుకునే అవకాశాలున్నాయి. చమురు ధరలు పెరిగితే, దాదాపు అన్ని ధరలు పెరిగే అవకాశముంటుంది. ఇది ద్రవ్యోల్భణం పెరుగుదలకు దారి తీస్తుంది. ఇది నిర్మలమ్మ ముందు ఉన్న పెను సవాల్.
జీడీపీ వృద్ధి రేటును స్థిరంగా కొనసాగించడం సవాలే. గత ఆర్థిక సంవత్సరం కరోనా కారణంగా జీడీపీ వృద్ధి మైనస్ 7.2 శాతం నమోదయింది. ఈసారి 9 శాతం వరకు ఉంటుందని భావిస్తున్నారు. దీనిని ఇలాగే కొనసాగించడం సవాల్‌తో కూడుకున్న అంసం.
ప్రభుత్వానికి ఆదాయ వనరులు పరిమితంగా ఉన్నాయి. ఖర్చులు పెరిగి ద్రవ్యలోటు పెరుగుతోంది. కరోనా కాలంలో కోట్లాదిమందికి ఉచిత రేషన్, గ్యాస్, రైతులకు ఎరువుల రాయితీ వల్ల భారం పడింది. ద్రవ్యలోటు రికార్ట్ స్థాయి 9.3కు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.3కు తగ్గవచ్చు. పెట్టుబడుల ఆధారిత వృద్ధి ద్వారా ద్రవ్యలోటును కట్టడి చేయవచ్చు. ఇందుకు అనుగుణంగా నిర్మలమ్మ ఏం చేస్తారనేది చూడాలి.

ఉద్యోగాల సృష్టి
అంతకుముందు మందగమనం, ఇప్పుడు కరోనా కారణంగా ప్రపంచంతో పాటు భారత్‌లోను నిరుద్యోగం పెరుగుతోంది. అయితే ఇటీవలి కాలంలో ప్రపంచంలో కంటే భారత్‌లో నిరుద్యోగిత రేటు ఎక్కువగా పెరిగింది. 1991లో ఆర్థిక సంక్షోభం నాటి కఠిన పరిస్థితులు 2019 నుండి 2021 మధ్య కనిపిస్తోందని అంటున్నారు. ఇందుకు మందగమనం, కరోనా కారణం. ఉద్యోగాల కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ప్రయివేటు రంగంలో ఉద్యోగాల కల్పన పెంచడం ఇప్పుడు నిర్మలమ్మ ముందు ఉన్న మరో సవాల్. ఉద్యోగుల నుండి రైతులు, చిన్న వ్యాపారుల నుండి సంస్థల వరకు పన్ను రాయితీలు లేదా అధిక సహకారం కోరుతున్నారు.

ప్రయివేటీకరణ
మనుగడ సాగించాలంటే ప్రయివేటీకరణ కీలకమని భావిస్తున్నారు. అయితే ప్రయివేటీకరణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందర్నీ ఒప్పించి ప్రయివేటీకరణపై దూకుడుగా సాధ్యం కాకపోవచ్చునని చెబుతున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.72 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు కనీసం రూ.10వేల కోట్లు సమీకరించలేదు. ఎల్ఐసీ ఐపీవో వస్తే మాత్రం దాదాపు రూ.1 లక్ష కోట్ల టార్గెట్ పూర్తవుతుంది.


Click it and Unblock the Notifications