నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో రియాల్టీకి సంబంధించి ఊరట కల్పిస్తుందని భావిస్తున్నారు. సాధారణంగా ఇళ్ల రుణాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే వచ్చే బడ్జెట్‌లో ఇంటి రుణం ఇన్సురెన్స్ ప్రీమియం చెల్లింపుకు కూడా ప్రత్యేకంగా పన్ను ప్రయోజనాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఎలాంటి ఆందోళన లేకుండా హోమ్ లోన్ పొందడానికి బడ్జెట్‌లో ఈ ప్రయోజనం కల్పించాలని ఇన్సురెన్స్ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాయి. ఆ దిశగా అడుగు ఉంటుందని భావిస్తున్నారు.
ప్రత్యేక్ష పన్ను మినహాయింపులను ప్రభుత్వం పెంచవలసి ఉందని, ఇంటి రుణాలకు బీమా తీసుకునే పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద అదనంగా రూ.1.5 లక్షల మినహాయింపు ఇవ్వాలని ఈ రంగం నుండి విజ్ఞప్తులు వచ్చాయి. కస్టమర్లు హోమ్ లోన్ ఇన్సురెన్స్ తీసుకునేలా ప్రోత్సహించాలని, బ్యాంకులు కూడా హోమ్ లోన్ తీసుకునేవారిని బీమా తీసుకోవాలని కోరుతున్నాయని చెబుతున్నారు. ప్రీమియం మొత్తాన్ని రుణ మొత్తంలో కలపడం వల్ల కస్టమర్లపై భారం పడుతుంది. అయితే పన్నుకు సంబంధించి ప్రయోజనం లేదని గుర్తు చేస్తున్నారు. ప్రీమియంపై ఉన్న జీఎస్టీ రేటును ప్రస్తుతం ఉన్న 18 శాతం నుండి తగ్గిస్తే ఇన్సురెన్స్ మరింత తగ్గుతుందని బీమా కంపెనీలు చెబుతున్నాయి.

అలాగే, ప్రస్తుత పన్ను నిబంధనల ప్రకారం ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ సమయంలో తీసుకున్న హౌసింగ్ లోన్ పైన వడ్డీ.. నిర్మాణం పూర్తయిన సంవత్సరం నుండి ఐదు సమాన ఇన్‌స్టాలేషన్స్‌లో మినహాయింపుగా అనుమతిస్తారు. ఈ నిబంధన కొంతమందికి ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే వారు ప్రతి సంవత్సరం బ్యాంకులు/ఆర్థిక సంస్థలకు ప్రీ-ఈఎంఐ వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. అయితే దీని కారణంగా మరింత కాలానికి వాయిదా పడుతుంది. నిర్మాణ కాలంలో కొనుగోలుదారుపై ఆర్థిక భారం కావడంతో పాటు ఏదైనా కారణం వల్ల నిర్మాణం ఆలస్యమైతే ఈ భారం మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నిర్మాణ కాలంలో గృహ రుణంపై వడ్డీ తగ్గింపుపై ఆశలు ఉన్నాయి.
సెక్షన్ 80డీ కింద వచ్చే ఆరోగ్య బీమా ప్రీమియంకు మినహాయింపు వర్తిస్తుంది. ఒక వ్యక్తి తన కుటుంబానికి చెల్లించిన రూ.25,000 ప్రీమియం వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు రూ.50,000 ఉంది. దీనిని రూ.50,000కు పెంచవచ్చునని భావిస్తున్నారు. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు రూ.1,00,000కు పెంచాలని కోరుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications