Budget 2022: క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం పొడిగింపు, కోర్ బ్యాంకింగ్ సిస్టంలోకి పోస్టాఫీస్
కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్(ECLGS) ద్వారా 130 లక్షల ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం కలిగిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఫిబ్రవరి 1, మంగళవారం నిర్మలమ్మ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. ఈ పథకాన్ని మార్చి 2023 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ స్కీం క్రెడిట్ లైన్‌ను రూ.5 లక్షల కోట్లకు పెంచారు. ఈ పథకాన్ని పొడిగించడం, క్రెడిట్ కవర్‌ను పెంచడాన్ని సీఐఐ స్వాగతించింది. ఇది ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొంది. ఎంఎస్ఎంఈల రేటింగ్‌కు రూ.6వేల కోట్లతో పథకం.
ప్రధానమంత్రి ఈ-విద్యలో భాగంగా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రత్యేక ఛానళ్లను ప్రారంభం. వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్ మార్పులు.పీఎం గతిశక్తి కింద వచ్చే అయిదేళ్లలో 100 కార్గో టెర్మినల్స్ నిర్మాణం. పీఎం గతి శక్తి ద్వారా అభివృద్ధితో పాటు మరిన్ని ఉద్యోగాలు, అవకాశాలు. పీపీపీ మోడల్‌లో పర్వతమాల. పట్టణాలు, నగరాల అభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళిక. నేషనల్ హైవే నెట్ వర్క్‌ను 2022-23 నాటికి 25,000 కిలో మీటర్లకు పొడిగింపు.

ఏకీకృత రిజిస్ట్రేషన్ వ్యవస్థ. దేశంలో ఎక్కడి నుండి అయినా రిజిస్ట్రేషన్‌కు నూతన వ్యవస్థ. దేశవ్యాప్తంగా డీడ్స్, రిజిస్ట్రేషన్లకు ఆధునిక వ్యవస్థ ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకం(NGDRS).
దేశవ్యాప్తంగా ఈ ఏడాది అందుబాటులోకి 5జీ టెక్నాలజీ. 2022-23లో ప్రయివేటు సంస్థల ద్వారా 5 టెక్నాలజీ ప్రవేశం.
మినిమం, మ్యాగ్జిమం గవర్నమెంట్ లక్ష్యంలో భాగంగా కాలం తీరిన చట్టాల రద్దు. డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్‌కు ఈ ఏడాది మరింత ప్రోత్సాహం.
కోర్ బ్యాంకింగ్ సిస్టంలోకి పోస్టాఫీస్‌లు. 1.5 లక్షల పోస్టాఫీస్‌ల ద్వారా ఆన్ లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు.


Click it and Unblock the Notifications