కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ వారం అంటే ఫిబ్రవరి 1న 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం నెరవేరే అవకాశాలు కనిపించడం లేదని వెల్లడవుతోంది. వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ (డిస్-ఇన్వెస్ట్‌మెంట్) ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ టార్గెట్ చేరుకోలేకపోవచ్చునని ఓ ఆంగ్లమీడియా సర్వేలో ఆర్థికవేత్తలు, అనలిస్ట్స్ తెలిపారు. ఇప్పటి వరకు 100 బిలియన్ డాలర్ల లోపు మాత్రమే వచ్చాయని, ఎల్ఐసీ ఐపీవో ప్రస్తుత త్రైమాసికంలో నెరవేరితే గానీ కాస్త పెరగవచ్చునని చెబుతున్నారు.

పెట్టుబడుల ఉపసంహరణ
కేంద్రం ఎల్ఐసీ, బీపీసీఎల్ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా పెద్ద మొత్తంలో వస్తుందని భావిస్తోంది. అయితే ఎల్ఐసీ డిస్-ఇన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. మార్చి నెలాఖరు నాటికి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. సెబికి ఐపీవో డ్రాఫ్ట్ సమర్పించిన మూడు వారాల్లోగా అనుమతి పొందేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా సెబి ఇందుకు 75 రోజుల సమయం తీసుకుంటుంది. కానీ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వస్తున్నందున మూడు వారాల్లో పూర్తి చేయాలని భావిస్తోంది. దేశంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎల్ఐసీ ఈక్విటీలో ఐదు శాతం ఐపీవో ద్వారా విక్రయించి రూ.లక్ష కోట్లు కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

లోపాల్లేకుండా...
ఎల్ఐసీకి సంబంధించి సెబి అనుమతి కోసం సమర్పించే పత్రాల రూపకల్పనలో నిమగ్నమైనట్లు దీపమ్ విభాగం కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో సెబికి సమర్పించే ఈ పత్రాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓసారి పత్రాలు అందించిన తర్వాత సెబి నుండి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఐపీవో ప్రక్రియ వేగవంతమవుతుందంటున్నారు. ఐపీవో మార్చి ప్రారంభంలో ఉండవచ్చునని తుహిన్ కాంత పాండే అన్నారు. ఇది భారత్‌లో అతిపెద్ద ఐపీవోగా చరిత్ర సృష్టిస్తుంది.

ఐపీవోకు వీలుగా...
ఎల్ఐసీ ఐపీవోకు వీలుగా ఈ చట్టానికి ప్రభుత్వం ఇప్పటికే పలు మార్పులు చేసింది. అవి గత ఏడాది జూన్ 30వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి. ఎక్స్చేంజీల్లో నమోదు కావడానికి అనువుగా లిస్టింగ్ నిబంధనలు అనుసరించి బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమించింది. చైర్మన్ పదవీ విరమణ వయస్సును సవరించింది. ఐపీవో పరిమాణంలో పది శాతం వరకు పాలసీదారులకు కేటాయిస్తుంది. ఐపీవోలో పాల్గొనాలనుకునే పాలసీదారు పాన్‌ను అప్ డేట్ చేయాలని కోరింది. షేర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం డీమ్యాట్ ఖాతా కూడా కలిగి ఉండాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications