Budget 2022: డిజిటల్ కరెన్సీపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన, క్రిప్టో కరెన్సీపై 30% పన్ను
క్రిప్టో కరెన్సీపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. సొంత క్రిప్టో కరెన్సీ ఉండాలని ఎప్పటి నుండో వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో నిర్మలమ్మ కీలక ప్రకటన చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తెస్తుందని తెలిపారు. బ్లాక్ చైన్, ఇతర టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ కరెన్సీని తీసుకు వస్తుందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే దీనిని తీసుకు వస్తుందని తెలిపారు. ఇది ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందన్నారు.
క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ పైన 30 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డిజిటల్ కరెన్సీ ద్వారా ఆదాయం, ఆస్తుల బదలీపై 30 శాతం పన్ను ఉంటుందని తెలిపారు. డిజిటల్ కరెన్సీల ఆదాయంపై పన్ను మినహాయింపుకు అవకాశం లేదు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39 లక్షల కోట్లు అని నిర్మలమ్మ తెలిపారు. 2022-23 బడ్జెట్‌లో ద్రవ్యలోటు 6.9 శాతం, దానిని 2025-26 నాటికి 4.5 శాతానికి తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రాలకు ఆర్థికసాయంగా రూ.1 లక్ష కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు.

నిర్మలమ్మ ప్రసంగంలో మరిన్ని ప్రకటనలు... చిప్ ఆధారిత పాస్ పోర్ట్స్ జారీ. ఈ-పాస్ పోర్ట్స్ జారీకి కొత్త టెక్నాలజీ. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీ లేని రుణం. ఇది రూ.1 లక్ష కోట్ల వరకు ఉంటుంది. సులభతరవాణిజ్య ప్రోత్సాహం రెండో దశ ప్రారంభం. పట్టణ ప్రణాళిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీకి రూ.250 కోట్లు. కాంట్రాక్టర్లకు ఈ-బిల్లులు పెట్టుకునే అవకాశం, ఈ బిల్లులు ఎప్పటికప్పుడు చూసుకునే వెసులుబాటు. రక్షణ రంగంలో ప్రయివేటు సంస్థలకు అవకాశం. డీఆర్డీవో, ఇతర రక్షణ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో ప్రయివేటు సంస్థలకు అవకాశం.


Click it and Unblock the Notifications