కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం యువత స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు ఇతర పెట్టుబడులపై ఎంతో ఆసక్తి చూపుతున్నారు. రిస్క్ ఎక్కువగా ఉన్నప్పటికీ, రిటర్న్స్ ఎక్కువగా ఉండే మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా క్రిప్టో కరెన్సీలోను ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ క్రిప్టో మార్కెట్ పైన తీవ్ర అనిశ్చితి నెలకొంది. గత పార్లమెంటు సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ బిల్లును తీసుకు వస్తారని భావించారు. క్రిప్టో పెట్టుబడులను నిషేధిస్తారా, నియంత్రిస్తారా, పన్నులు విధిస్తారా అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అయితే అప్పుడు బిల్లు తీసుకురాలేదు. అయితే బడ్జెట్‌లో క్రిప్టో పెట్టుబడులపై నిర్మలమ్మ స్పష్టత ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. సామాన్య పెట్టుబడిదారుల నుండి పెద్ద పెట్టుబడిదారుల వరకు క్రిప్టో పెట్టుబడులపై స్పష్టత కోరుతున్నారు.

క్రిప్టో పన్ను
క్రిప్టో కరెన్సీ పెట్టుబడులపై ఆర్బీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే క్రిప్టో నిషేధం కాదని, నియంత్రణ అవసరమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. క్రిప్టో కరెన్సీలు బిట్ కాయిన్, ఎథేరియం, డోజీకాయిన్, షిబా ఇను వంటి వాటిపై పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నారు. క్రిప్టో పెట్టుబడులపై పన్నులు విధించడం ద్వారా నియంత్రించవచ్చునని సూచిస్తున్నారు. ఈ పన్నులు రాబడిపై 30 శాతం వరకు ఉండవచ్చునని అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. 36 నెలల కంటే తక్కువ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఈక్విటీ, ఈక్విటూ మ్యూచువల్ ఫండ్స్ పైన 15 శాతంగా ఉంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10 శాతం నుండి 20 శాతంగా ఉంది. అలాగే క్రిప్టో పైన ఉండాలని చెబుతున్నారు. క్రిప్టో పైన క్యాపిటల్ గెయినస్, బిజినెస్ ఆదాయం, జీఎస్టీ వంటివి ఉండాలంటున్నారు.

ఈ పన్నులు
క్రిప్టో కరెన్సీల్లోని పెట్టుబడుల మీద ఆదాయం పైన పన్ను, టీడీఎస్, టీసీఎస్, క్రిప్టో క్రయ, విక్రయాలు, జీఎస్టీ విధింపు వంటి అంశాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. క్రిప్టో ట్రాన్సాక్షన్స్ పైన పన్ను విధించేందుకు నిబంధన తేవాలనే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి దేశీయంగా క్రిప్టోకు ప్రోత్సాహం లభిస్తుంది.

క్రిప్టోపై ఎప్పుడేం జరిగింది?
క్రిప్టో పెట్టుబడులపై ఆర్బీఐ మొదటి నుండి ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2018లో ఆర్బీఐ నిషేధించడంతో క్రిప్టోపై పెద్ద ఎత్తున చర్చ సాగింది.
2021లో సుప్రీం కోర్టు తీర్పు అనంతరం క్రిప్టో కార్యకలాపాలపై నిషేధాన్ని ఎత్తివేసింది ఆర్బీఐ.
సెప్టెంబర్ 2021లో క్రిప్టో ఆదాయంపై పన్నుకు సంబంధించి చర్చలు సాగాయి.
నవంబర్ 15, 2021 క్రిప్టో మార్కెట్ పైన చర్చించేందుకు ప్రభుత్వం ఇండస్ట్రీ నిపుణులను ఆహ్వానించింది.
నవంబర్ 24, 2021న క్రిప్టో బిల్లు పెడతారని వార్తలు వచ్చాయి.
- నవంబర్ 30, 2021న నిర్మలా సీతారామన్ క్రిప్టో బిల్లు పైన ఫ్రెష్ అప్ డేట్ ఇచ్చారు. కేబినెట్ క్లియరెన్స్ అనంతరం క్రిప్టో బిల్లు వస్తుందని తెలిపారు.
- డిసెంబర్ 23, 2021న పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. కానీ క్రిప్టో బిల్లు పైన ఎలాంటి క్లారిటీ రాలేదు.
- ఇప్పుడు బడ్జెట్‌లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications