కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం ప్రపంచం పైన, భారత్ పైన పడుతోంది. ప్రస్తుత ఒమిక్రాన్ నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు నాలుగో బడ్జెట్ మరింత సవాలుగా మారవచ్చు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక పునరుద్ధరణ కోసం ఉద్దీపన అందించేందుకు ప్రభుత్వ వద్ద ఆదాయం తక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో ఎదురుగాలికి అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ద్రవ్యలోటు పెరిగింది. వచ్చే నెలలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో నిర్మల్మకు ఇది సవాల్ అంటున్నారు.

నిర్మలమ్మకు సవాల్
గత త్రైమాసికం పండుగ సమయంలో షార్ప్ రికవరీ కనిపించింది. అయితే ఒమిక్రాన్ ప్రభావంతో ఆ తర్వాత మందగించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధి రేటు తగ్గుతుందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. 2019-19 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 4 శాతంగా నమోదయింది. కరోనా కారణంగా 20220-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.4 శాతానికి పడిపోయింది.
అదే సమయంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 13.7 శాతం, రెండో అర్ధ సంవత్సరంలో 5.6 శాతంగా ఉంటుందని అంచనా.

ద్రవ్యోల్భణం
ద్రవ్యోల్భణం గత ఏడాది కాలంగా పెరుగుతూ వస్తోంది. 2021 మార్చిలో WPI ద్రవ్యోల్భణం 7.89 శాతంగా ఉండగా, మే నెలలో 13.11 శాతానికి పెరిగింది. ఆ తర్వాత తగ్గినప్పటికీ డబుల్ డిజిట్‌లో ఉంది. అక్టోబర్ నెలలో 12.54 శాతం, నవంబర్ నెలలో 14.23 శాతంగా నమోదయింది. ఇక CPI ద్రవ్యోల్భణం గత ఏడాది మార్చిలో 5.52 శాతంగా నమోదయింది. జూన్ నెలలో 6.26 శాతానికి చేరుకుంది. జూలై నుండి క్రమంగా తగ్గింది. నవంబర్ నెలలో 4.91 శాతంగా నమోదయింది.

ఇలా చేయాలి..
వరుసగా గత కొన్ని నెలలుగా జీఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ ప్రభావం మరోసారి ఆర్థిక మందగమనానికి కారణం కావొచ్చు. ఇందుకు ప్రయివేటీకరణ దూకుడును కొనసాగించడం ఓ మార్గంగా భావిస్తున్నారు.
అసెట్ మానిటైజేషన్ బడ్జెట్ పైన భారం పడకుండా క్యాపెక్స్‌కు మద్దతు ఇస్తుంది. ఆస్తి మానిటైజేషన్‌ను అనుమతించడానికి పన్ను విధానాలను క్లియర్ చేయాలి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications