ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా కీలకం. దేశంలోని మొత్తం అసెంబ్లీ సీట్లలో 10 శాతం సీట్లు ఇక్కడే ఉంటాయి. అత్యధికంగా 400కు పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు అన్ని జాతీయ పార్టీలు కూడా ఎంతో ప్రాధాన్యతను ఇస్తాయి. ఇలాంటి యూపీ ఎన్నికల సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. యూపీతో (403) పాటు పంజాబ్(117), ఉత్తరాఖండ్ (70), మణిపూర్(60), గోవా(40)లకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికలను పరిగణలోకి తీసుకొని బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. దీనికి తోడు కరోనా ప్రభావం, ద్రవ్యోల్భణం, మౌలిక సదుపాయాలు, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది. ఈ బడ్జెట్‌పైన వివిధ రంగాలు, వేతనజీవులు, చిన్న వ్యాపారుల నుండి సంస్థలు.. అందరూ కోటి ఆశలతో ఉన్నారు.

ఉద్యోగాల కల్పన
గత ఏడాదితో పోలిస్తే జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతంగా నమోదు కావొచ్చునని అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్భణం 5.6 శాతంగా ఉంది. చమురు ధర 90 డాలర్లకు చేరుకుంది. మరోవైపు నిరుద్యోగం భారీగా పెరిగింది. విద్యావంతులు సంఘటితరంగంపై దృష్టి సారించగా, దేశంలో దాదాపు తొంబై శాతం అసంఘటిత రంగంలోనే అవకాశాలు ఉన్నాయి. దాదాపు సగం జీడీపీ ఈ రంగం నుండే వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అసంఘటిత రంగంలో ఉద్యోగాలను పెంచడంపై దృష్టి సారించవచ్చునని భావిస్తున్నారు.

సామాన్యుల నుండి పరిశ్రమ వరకు..
కరోనాతో దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచాలని కోరుతున్నారు. దీనిని కేంద్రం పరిగణలోకి తీసుకోవచ్చునని భావిస్తున్నారు. పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి రూ.6000 అందుతోంది. దీనిని రూ.8000కు ఇవ్వవచ్చునని భావిస్తున్నారు.
చమురు ధరలపై భారం తగ్గించేలా ప్రకటన రావొచ్చునని, అప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవచ్చునని భావిస్తున్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని కోరుతున్నారు.
సామాన్యుల నుండి ఉద్యోగుల వరకు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పన్ను భారాలు తగ్గించాలని కోరుతున్నారు. ఆదాయపు పన్నులో మార్పులు చేయాలని అంటున్నారు.
హోమ్ లోన్ వడ్డీ పైన మినహాయింపు పరిమితి రూ.2 లక్షలు ఉండగా, దీనిని రూ.3 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.
పీఎఫ్ పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.
పారిశ్రామిక రంగం మరిన్ని రాయితీలు కోరుకుంటోంది.

రోడ్డు, రైల్వే, మౌలిక సదుపాయాలు
ఈసారి పెద్ద ఎత్తున కొత్త పథకాల జోలికి వెళ్లకుండా, ఉన్న పథకాలను బలోపేతం చేయవచ్చునని అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికలు ఉన్న ఐదు రాష్టార్ల్లో రోడ్డు, రైల్వే, మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైలు మార్గాల ప్రయివేటీకరణ, విద్యుత్ పంపిణీ ప్రయివేటీకరణ వంటి అంశాలపై కేంద్రం దూకుడుగా ముందుకు సాగకపోవచ్చునని భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications