For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిర్మలా సీతారామన్ బడ్జెట్, గతంలో చేసిన కొన్ని ప్రకటనలు ఇలా...

|

ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలో కొన్ని అమలు కాకపోవడం లేదా అమలు ఆలస్యం కావడం జరిగాయి. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన రెండో దశ కింద 2019-20 నుంచి 2021-22 మధ్య 1.91 కోట్ల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత అయిదేళ్లలో 91 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించారు. ఈ లోపు నిర్మాణ లక్ష్యం 1.5 కోట్లు కాగా ఆ లక్ష్యం చేరలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 4.5 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించారు.

2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని వారికి నల్లా నీళ్లు అందించాలని, ఇందుకు రాష్ట్రాలతో కలిసి పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ విధివిధానాల రూపకల్పన డిసెంబర్ 2019 నాటికి పూర్తయింది. అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే ఇది వేగవంతం కావాలి.

సూపర్ ఆఫర్: రూ.7,090 డిస్కౌంట్‌తో హీరో ఎలక్ట్రిక్ E-స్కూటర్, పేటీఎం ద్వారా రూ.10,500 ఆదాసూపర్ ఆఫర్: రూ.7,090 డిస్కౌంట్‌తో హీరో ఎలక్ట్రిక్ E-స్కూటర్, పేటీఎం ద్వారా రూ.10,500 ఆదా

Budget 2020: Which are slow in implementation of last budget

2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ.1,05,000 కోట్ల విలువైన పెట్టుబడులు ఉపసంహరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు రూ.17 వేల కోట్ల పై చిలుకు మాత్రమే వచ్చాయి. ఎయిర్ ఇండియాను విక్రయించాల్సి ఉంది.

గత బడ్జెట్‌లో పాన్ - ఆధార్ లింక్, పాన్ స్థానంలో ఆధార్ ఉపయోగించే వెసులుబాటు, రూ.50 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు మినహాయింపులు, భారత్ బాండ్స్ ఈటీఎఫ్ పేరుతో తొలి కార్పోరేట్ బాండ్, స్టార్టప్స్ కోసం డీడీ ఛానల్స్‌లో ప్రత్యేక కార్యక్రమం వంటి వాటిని అమలు చేశారు. కాగా, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2020న తదుపరి బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.

English summary

నిర్మలా సీతారామన్ బడ్జెట్, గతంలో చేసిన కొన్ని ప్రకటనలు ఇలా... | Budget 2020: Which are slow in implementation of last budget

As finance minister Nirmala Sitharaman prepares to present her second budget at a time growth is projected to decelerate to 4.8% in 2019-20 by the International Monetary Fund.
Story first published: Tuesday, January 21, 2020, 14:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X