నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో హోమ్ బయ్యర్స్‌కు ప్రయోజనం కలిగేలా ప్రకటనలు ఉండాలని కాన్ఫడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) గురువారం ప్రభుత్వాన్ని కోరింది. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తుందని చెబుతోంది. జీడీపీ వృద్ధి రేటును 6 నుంచి 7 శాతానికి తీసుకు వెళ్లేందుకు ఉపయోగపడుతుందని CII అంటోంది.

ఆవాస్ యోజన పరిమితిలు పెంచాలి
హోమ్ బయ్యర్స్‌కు పన్ను ఊరట ఉండాలని CII కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలోని (PMAY) ఆదాయ పరిమితులను మరింతగా పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఇలాంటి చర్యల వల్ల నగదు కొరత కారణంగా ఇబ్బందుల్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

పన్ను ప్రోత్సాహకాలు ఉండాలి
వినియోగదారుల డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యక్ష పన్నులను తగ్గించాలని, రియల్ ఎస్టేట్ డిమాండ్‌ను పునరుద్ధరించేందుకు హోమ్ బయ్యర్స్‌కు ప్రత్యేక పన్ను ప్రోత్సాహకాలు ఉండాలని కోరుతోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊతమిచ్చే ప్రకటనలు ఉండాలని కోరుతున్నారు.

ఉద్యోగాలు పెరుగుతాయి
జీడీపీ వృద్ధి రేటును వచ్చే ఏడాదికి 7 శాతానికి పెంచడానికి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వడం కూడా చాలా అవసరమని CII చెబుతోంది. రియల్ ఎస్టేట్ రంగానికి సిమెంట్, స్టీల్ వంటి వాటికి డిమాండ్ పెరిగి, ఉద్యోగాల కల్పన పెరుగుతోందని చెబుతోంది.

ఇలా చేస్తే..
ప్రస్తుతం ఇళ్లు కొనుగోలుకు తీసుకున్న రుణాల వడ్డీ చెల్లింపులపై ఉన్న పన్ను మినహాయింపు పరిధిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు చేర్చాలని CII కోరుతోంది. దీంతో పాటు PMAY కింద ఆదాయ పరిధిని రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షలు చేయాలని, ప్రస్తుతం ఇది రూ.12 లక్షల నుంచి రూ.18 మధ్య ఉంది. ఇలా చేస్తే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందంటున్నారు.


Click it and Unblock the Notifications