ఢిల్లీ: ప్రజల ఆదాయాలు పెంపు, కొనుగోలు శక్తిని పెంచే దిశగా తాము బడ్జెట్‌ను తీసుకు వచ్చామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. శనివారం ఉదయం పదకొండు గంటలకు ఆమె బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. భారీ మెజార్టీతో అధికారం అప్పగించినట్లు చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో తాము మరింత ఉత్సాహంగా పని చేస్తున్నామన్నారు.
ఇది సామాన్యుల బడ్జెట్ అన్నారు. దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టామన్నారు. జాతి నిర్మాణంలో యువత, మహిళలు అందరిదీ కీలక పాత్ర అన్నారు. ప్రజల ఆదాయం పెంపు, కొనుగోలు శక్తి పెంచేలా ఈ బడ్జెట్‌లో మరిన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు. యువతను మరింత శక్తిమంతంగా చేసేలా ఉంటాయన్నారు.

ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని, ద్రవ్యోల్భణం అదుపులో ఉందని చెప్పారు. నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. జీఎస్టీ చారిత్రాత్మక సంస్కరణ అన్నారు. జీఎస్టీ అమలు తర్వాత సామాన్యులకు నెలవారీ ఖర్చులు 4 శాతం ఆదా అయినట్లు తెలిపారు.
కాగా, వన్ నేషన్, వన్ ట్యాక్స్ నినాదంతో తీసుకువచ్చిన జీఎస్టీ మంచి ఫలితాలను తీసుకు వచ్చిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్ను చెల్లింపులను మరింత సరళతరం చేస్తామన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి తన బడ్జెట్ ప్రసంగంలో పన్ను చెల్లింపుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications