న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థ BSNL సూపర్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. సాధారణంగా మనం చేసే ఫోన్ కాల్‌కు టెలికం ఆపరేటర్లు కొంత మొత్తం వసూలు చేస్తాయి. జియో వచ్చిన తర్వాత పోటీ కారణంగా ఉచితంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం రివర్స్ రూట్లో వస్తోంది. మీరు మాట్లాడే ప్రతి 5 నిమిషాలకు గాను 6 పైసలు మీ అకౌంట్‌లో వేస్తుంది. ఈ అద్భుతమైన అవకాశం బీఎస్ఎన్ఎల్ వైర్ లైన్, బ్రాడ్‌బాండ్, FTTH కస్టమర్లకు వర్తిస్తుంది. సబ్‍స్క్రైబర్లకు ఆ డబ్బులు క్యాష్ బ్యాక్ రూపంలో అందుతాయి.

జియో యూజర్ల అసంతృప్తి... బీఎస్ఎన్ఎల్ ఆశలు
టెలికం రంగంలో ప్రయివేటు సంస్థల హవా కొనసాగుతోంది. అలాగే, ల్యాండ్ లైన్ ఉపయోగించే వారి సంఖ్య భారీగా పడిపోయింది. కస్టమర్ల పరంగా, ఆర్థికపరంగా బీఎస్ఎన్ఎల్ ఇబ్బందులకు ఇవి కూడా కారణం. ఈ నేపథ్యంలో తమ ఈ ప్లాన్ కస్టమర్లు పెరిగేందుకు ఉపయోగపడుతుందని భావిస్తోంది. ముఖ్యంగా జియో కారణంగా మరో సంస్థ వైపు చూస్తున్న వారు తమవైపు వస్తారని భావిస్తోంది. జియో యూజర్లకు IUC ఛార్జీల కింద నిమిషానికి 6 పైసలు ఛార్జ్ చేస్తోన్న విషయం తెలిసిందే. జియో యూజర్లు ఈ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో బీఎస్ఎన్ఎల్ ఈ సమయాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది.

6 పైసలు ఇస్తాం...
దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కస్టమర్లకు ఒక నెల పాటు ఉచిత బ్రాండ్ బ్యాండ్, వైఫై సేవలు అందించనున్నట్లు కన్స్యూమర్ ఫిక్స్డ్ యాక్సిస్ (CFA) ఎండీ (ఢిల్లీ) వివేక్ బాంజాల్ తాజాగా తెలిపారు. ల్యాండ్ లైన్ కస్టమర్లు ఏ ఆపరేటర్‌కు అయినా 5 నిమిషాల కంటే పైన అవుట్ గోయింగ్ మాట్లాడితే 6 పైసలు కస్టమర్లకే తిరిగి తాము చెల్లిస్తామని, అలా ఎన్ని కాల్స్ మాట్లాడినా చెల్లిస్తామని చెప్పారు.

నెక్స్ట్ జనరేషన్ నెట్ వర్క్‌కు అప్ గ్రేడ్
డిజిటల్ యుగంలో కస్టమర్లు వాయిస్, డేటా సర్వీస్ కోసం నాణ్యతను కోరుకుంటున్నారని, బీఎస్ఎన్ఎల్‌ను నెక్స్ట్ జనరేషన్ నెట్ వర్క్‌కు అప్ గ్రేడ్ చేశామని, వైర్ లైన్‌లో జరిగే వాయిస్ కాల్ నాణ్యతను తమ కస్టమర్లు ఆనందిస్తారని భావిస్తున్నామని వివేక్ బంజాల్ అన్నారు.

ఉచిత బ్రాడ్ బ్యాండ్ ప్లాన్
ఉచిత బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌ను రానున్న నెల రోజుల పాటు 10Mbps స్పీడ్‌తో రోజుకు 5GB వరకు ఉచితంగా ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చునని చెప్పారు. ఆ తర్వాత కనీస ప్లాన్ నెలకు రూ.349 (రోజుకు 2GB, 8Mbps స్పీడ్) నుంచి మొదలవుతుందని చెప్పారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో 4G సేవలు ప్రారంభమైనట్లు సీఎఫ్ఏ చెప్పారు. త్వరలో మొత్తం రాష్ట్రంలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఫైబర్ కనెక్టివిటీతో కేబుల్, ఇతర డేటా సేవలు అందించే సంస్థల భాగస్వామ్యంతో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్, వైఫై కనెక్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో తొలి ప్రయత్నంగా విశాఖలో వీటిని ప్రారంభిస్తామన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications