ఇండియాలో ప్రభుత్వ యజమన్యంలోని టెలికం దిగ్గజం భారతీయ సంచార నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రస్తుతం ఇండియాలోని టెలికాం సెక్టార్లో సెన్సేషన్ కొనసాగిస్తోంది. అయితే బిఎస్ఎన్ఎల్ పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యం ద్వారా నిర్వహించబడుతుంది. అయితే ఒకప్పుడు యూజర్స్ అతంత మాత్రమే ఉన్న ఈ టెలికాం ఇప్పుడు 5జి రోల్ అవుట్ సహా సబ్ స్క్రయిబర్స్ సంపాదించుకుంటూ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఫోన్ వంటి ప్రయివేట్ టెలికాం దిగ్గజాలకు పోటీగా నిలుస్తుంది. బిఎస్ఎన్ఎల్ నెటవర్క్ సేవలు 2002లో ప్రారంభమయ్యాయి.
ఇంటర్నెట్ టీవీ సర్వీస్
తాజగా ఫైబర్ కనెక్టివిటీని అందించే IFTVగా పిలిచే భారతదేశపు మొట్టమొదటి ఇంటర్నెట్ టీవీ సర్వీస్ని బిఎస్ఎన్ఎల్ తాజాగా ప్రారంభించింది. ఈ సర్వీస్ మొదట్లో మధ్యప్రదేశ్, తమిళనాడులో అందుబాటులో ఉండగా ఇప్పుడు పంజాబ్‌లో కూడా ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్ టీవీ సర్వీస్ అందించడంలో స్పెషాలిటీ ఉన్న స్కైప్రో కంపెనీతో BSNLకి పార్ట్నర్షిప్ ఉంది.

5.5 మిలియన్ల యూజర్లు
జూన్ 2024లో ప్రైవేట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు టారిఫ్ పెంపు ప్రకటించిన తర్వాత దాదాపు 5.5 మిలియన్ల మొబైల్ యూజర్లు (అక్టోబర్ 2024 వరకు) ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కి పోర్ట్ అయ్యారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) డేటా ప్రకారం, జూలై నుండి అక్టోబర్ 2024 నాటికీ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా నుండి బిఎస్ఎన్ఎలోకి మారిన కస్టమర్లు భారీగా పెరిగారు.
బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డ్ సేల్స్
మరోపక్క బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డ్ సేల్స్ కూడా పెరిగాయి. కంపెనీ జూన్ 2024లో 790,000 సిమ్ కార్డ్స్ విక్రయించింది, అయితే లెక్కలు జూలై 2024లో 4.9 మిలియన్లకు, ఆగస్టు 2024లో 5 మిలియన్లకు, సెప్టెంబర్‌లో 2.8 మిలియన్లకు, అక్టోబర్ 2024లో 1.9 మిలియన్లు పెరిగింది.
టాటాతో బిఎస్ఎన్ఎల్
గతంలో టాటా గ్రూప్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారతదేశం అంతటా 4G నెట్‌వర్క్ తీసుకురావడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)తో చేతులు కపిపింది. BSNLతో ఈ డీల్ రూ.15,000 కోట్లు. నివేదికల ప్రకారం TCS, తేజస్ నెట్‌వర్క్‌లు అండ్ ప్రభుత్వ యాజమాన్యంలోని ITI భవిష్యత్తులో 5Gకి అప్‌గ్రేడ్ చేయగల ఈ 4G నెట్‌వర్క్ విస్తరణ కోసం BSNL నుండి సుమారు రూ.19,000 కోట్ల ఆర్డర్స్ పొందింది.
టారిఫ్ ప్లాన్స్ పెంపు
ప్రైవేట్ టెలికాం నెట్‌వర్క్‌లు ప్రతినెలా, 3 నెలల లేటా అన్యువల్ రీఛార్జ్ ప్లాన్‌లను 25 శాతం వరకు పెంచగా బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా అత్యంత సరసమైన టారిఫ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో డేటా అడ్ ఆన్ ప్లాన్స్ ఇంకా ఇతర టెలికాం కంపెనీలతో పోల్చితే అతితక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తుంది. అయితే టారిఫ్ ప్లాన్స్ పెంచకుండా కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టడం గమనించ తగ్గ విషయం.
బిఎస్ఎన్ఎల్ 5జి
ఈ ప్రభుత్వ టెలికాం సంస్థ ఇప్పుడు నెమ్మదిగా ప్రైవేట్ కంపెనీలతో పోటీగా 5G సేవలను అతి త్వరలో తీసుకొచ్చేనందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై 5G సేవకు ప్రభుత్వం గడువు కూడా విధించింది. వచ్చే ఏడాది మే 2025 నాటికి ప్రభుత్వం 1 లక్ష బేస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. దీని తర్వాత కంపెనీ జూన్ 2025 నాటికి 5G సేవకు మారుతుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.
శాటిలైట్-టు-డివైస్
బిఎస్ఎన్ఎల్ మొట్టమొదటి "శాటిలైట్-టు-డివైస్" సర్వీస్ ప్రారంభించింది, ఈ సర్వీస్ దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు కూడా కనెక్టివిటీని అందిస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఈ విషయాన్ని ప్రకటించింది. అమెరికన్ కంపెనీ Viasat సహకారంతో ఈ సేవను ప్రారంభించినట్లు తెలిపింది. సాధారణ మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని అందించడమే ఈ కొత్త టెక్నాలజీ లక్ష్యం.
అయితే రానున్న రోజుల్లో బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ప్లాన్స్ కి చెక్ పెడుతూ టెలికాం రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు 2025లో మరిన్ని బడ్జెట్ ప్లాన్స్ ద్వారా యూజర్లను ఆకర్షించే గేమ్ ఛంజర్ కానుందని, ఇక 5జి వచ్చాక ప్రజలకి టారిఫ్ ప్లాన్స్ తో ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా తక్కువ ధరకే 5జి ప్లాన్స్ అందిస్తున్న టెలికాంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications