న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వీఆర్ఎస్ (VRS) స్కీం ప్రారంభమైంది. ఈ స్కీంకు 1 లక్షమందికి వరకు ఎలిజిబుల్ కాగా, 70వేల నుంచి 80 వేలమంది ఈ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశముందని భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గి, రూ.7వేల కోట్ల మేర జితభత్యాల వ్యయ భారం తగ్గే అవకాశముందని BSNL అంచనా వేస్తోంది. బీఎస్ఎన్ఎల్‌లో 1.50 లక్షల మంది నుంచి 1.75 లక్షలమంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 50 ఏళ్లు దాటిన వారు లక్ష వరకు ఉంటారని అంచనా.

నవంబర్ 4 నుంచి డిసెంబర్ 3 వరకు వీఆర్ఎస్ ఆఫర్
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నవంబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు VRS కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను ఫీల్డ్ యూనిట్లకు అందించామని, వారు ఉద్యోగులందరికీ ఈ వివరాలు చెబుతారని అన్నారు. వీఆర్ఎస్ ఆఫర్ వివరాలు వారి నుంచి తెలుసుకోవచ్చునని చెప్పారు.

అద్భుత అవకాశం ఉపయోగించుకోవచ్చు..
మొత్తం ఉద్యోగుల్లో దాదాపు లక్షమంది వీఆర్ఎస్‌కు అర్హులని, వీరిలో 70 వేల నుంచి 80వేల మంది బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోవచ్చునని చెప్పారు. వీరి వీఆర్ఎస్ వల్ల రూ.7వేల కోట్ల మేర జీతభత్యాల భారం తగ్గనుందన్నారు.

వీరంతా అర్హులు...
BSNL వాలంటరీ రిటైర్మెంట్ స్కీం - 2019 అందరు రెగ్యులర్, పర్మినెంట్ ఉద్యోగులు అర్హులు. ఇతర ఆర్గనైజేషన్ల నుంచి డిప్యుటేషన్ మీద వచ్చిన వారు కూడా వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 50 ఏళ్లకు పైబడిన ఉద్యోగులు దీనికి అర్హులు.

ఇలా లెక్కగట్టి ఇస్తారు..
ఇప్పటి వరకు పూర్తి చేసుకున్న సర్వీసుకు గాను ఏడాదికి 35 రోజుల చొప్పున వేతనాన్ని, రిటైర్మెంట్ వయస్సుకు మిగిలి ఉన్న ఏళ్లకు గాను 25 రోజుల వేతనాన్ని వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా కింద కట్టి అందిస్తారు.

ఎంటీఎన్ఎల్‌కు కూడా వీఆర్ఎస్
అలాగే, ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకు కూడా వీఆర్ఎస్ అమలు చేస్తోంది. వారు కూడా డిసెంబర్ 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 31, 2020 నాటికి 50 ఏళ్లు నిండేవారు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ఎంటీఎన్ఎల్ నోటీసులో పేర్కొంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లో దాదాపు 2 లక్షల మంది ఉంటారు.

రిటైర్మెంట్ ఏజ్ 58కి తగ్గించే ఛాన్స్
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 58కి తగ్గించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత రిటైర్మెంట్ వయస్సు 60.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications