BSNL News: BSNL నుంచి భారీ ఆదాయం.. ప్రతినెలా వేలల్లో సంపాదన.. ఇంట్లో కూర్చునే..
Income from BSNL: ప్రముఖ ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL తిరిగి పుంజుకుంటోంది. పూర్వ వైభవం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. జియో, ఎయిర్టెల్ వంటి దిగ్గజ ప్లేయర్స్ కు గట్టి పోటీ ఇస్తూ చౌకైన రీఛార్జి ప్లాన్స్ తాజాగా ప్రవేశపెట్టింది. నెట్వర్క్ విషయంలో ఇంకా వెనకబడి ఉన్నప్పటికీ ఇటీవలే 5G రోల్ అవుట్ కు సర్వం సిద్ధం చేసుకుంది. దీంతో ప్రజలు కూడా గట్టిగా సొమ్ము చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
భారీ స్థాయి విస్తరణ ప్లాన్లో భాగంగా పెద్ద ఎత్తున మొబైల్ టవర్స్ ఇన్స్టాల్ చేసేందుకు BSNL రెడీ అవుతుంది. ఇందుకుగాను దేశవ్యాప్తంగా స్థలం అవసరం అవుతుంది. ప్రజలు ఎవరైనా తమ బిల్డింగ్స్ పైన సెల్ టవర్ ఇన్స్టాల్ చేసేందుకు అంగీకరిస్తే, వారికి ప్రతినెలా అద్దె చెల్లించేందుకు చూస్తోంది. ఈ విధంగా చక్కని ఆదాయ మార్గాన్ని ఈ టెలికాం సంస్థ ప్రజల ముందుకు తీసుకొచ్చింది.

దీనికోసం ముందుగా ఇండస్ టవర్స్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ల్యాండ్ ఓనర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. వివరాలు పూర్తి చేసిన పిమ్మట ఇండస్ టవర్స్ ప్రతినిధులు మీ ఇంటికి సర్వే నిమిత్తం వస్తారు. తమ నియమ, నిబంధనలను వివరిస్తారు. వాటిని ఇరుపక్షాలు అంగీకరించినట్లయితే టవర్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సర్వే జరిగే సమయంలోనే నెలవారీ అద్దె, కాంట్రాక్టు వ్యవధి వంటి వివరాలు కూడా చర్చించుకోవాల్సి ఉంటుంది.
ఇంటిపై మొబైల్ టవర్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఆదాయంతో పాటు సదరు నెట్వర్క్ రీఛార్జ్‌లు కూడా ఉచితంగా పొందవచ్చు. ఇలా రెండు రకాల బెనిఫిట్స్ సొంతం అవుతాయి. అయితే ఈ లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయనే విషయాన్ని ఆశావహులు గ్రహించాల్సి ఉంటుంది.
అవేంటంటే మొబైల్ టవర్స్ ఎక్కువగా రేడియేషన్ విడుదల చేస్తాయి. దీర్ఘకాలంలో ఇది పలు రకాల క్యాన్సర్స్‌కు కారణం అవుతాయి. అంతేకాకుండా నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి వంటి రుగ్మతలు తలెత్తే అవకాశం ఉంది. వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకున్న తర్వాతే ఈ విషయంలో ముందుకు వెళ్తే బాగుంటుందని గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications