బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. లైఫ్ టైమ్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌కు స్వస్తీ చెప్పింది. లైఫ్ టైమ్ ప్లాన్స్‌తో కస్టమర్లకు తక్కువ టారిఫ్‌తో అధిక ప్రయోజనాలు అందుతాయి. ప్రస్తుతం ఈ ప్లాన్స్ కలిగిన కస్టమర్లను రూ.107 ప్లాన్‌లోకి మారుస్తోంది బీఎస్ఎన్ఎల్. ఈ మార్పు డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. రూ.107 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో అన్-లిమిటెడ్ ఇన్‌కమింగ్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్స్‌తో వచ్చే 10GB డేటా 30 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. 24 రోజులు 100 నిమిషాల ఔట్ గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే రూ.107 ప్లాన్‌లో సాధారణంగా ఇచ్చే ఉచిత సేవలు, లైఫ్‌టైమ్ ప్లాన్స్ ద్వారా బదలీ అయ్యే ఖాతాదారులకు వర్తించవు. బీఎస్ఎన్ఎల్ రూ.2,399 వార్షిక ప్రీ-పెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీని మరో 2 నెలలపాటు పొడిగించింది. వ్యాలిడిటీ 425 రోజులకు పెరుగుతుంది.

వారికి ఉచితం లేదు
రూ.107 ప్లాన్ మొత్తం కాలపరిమితి మూడు నెలలు. అపరిమిత ఇన్-కమింగ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్స్‌తో లభించే 10GB డేటా కాలపరిమితి మాత్రం ముప్పై రోజులు అందుబాటులో ఉంటుంది. వంద నిమిషాల ఔట్ గోయింగ్ కాల్స్ కాలపరిమితి 24 రోజులు, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్‌ను అరవై రోజుల పాటు వినియోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో 84 రోజుల కాలపరిమితితో 3GB ఉచిత డేటా లభిస్తుంది. ముంబై, ఢిల్లీ సహా ఏ నెట్ వర్క్‌కు అయినా వంద నిమిషాల ఉచిత కాల్స్ వంద రోజుల పాటు నేషనల్ రోమింగ్‌తో లభిస్తాయి. అలాగే అరవై రోజులపాటు బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ లభిస్తాయి. అయితే లైఫ్ టైమ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ నుండి రూ.107 ప్లాన్‌లోకి మారేవారికి మాత్రం ఈ ఉచిత వర్తించదు.

ఈ వార్షిక ప్లాన్ పొడిగింపు
బీఎస్ఎన్ఎల్ రూ.2399 వార్షిక ప్లాన్ కాలపరిమితిని మరో 60 రోజులు పెంచింది. అంటే ఇది 425 రోజులతో లభిస్తుంది. సాధారణంగా దీని కాలపరిమితి 365 రోజులు. డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. రోజుకు 3GB డేటా, 80 Kbps వేగంతో లభిస్తుంది. రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు ఉచితం. ఏ నెట్ వర్క్‌కు అయినా 100 ఉచిత వాయిస్ కాలింగ్స్ ఉచితం.

ఆ ప్రయోజనం అందరికీ
బీఎస్ఎన్ఎల్ తన ఎరోస్ నౌ ప్రయోజనాన్ని అన్ని పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌కు విస్తరించింది. ఎరోస్ నౌ హిందీ, మరాఠీ, బెంగాళీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, గుజరాతీ, పంజాబీ వంటి పలు భాషల్లో కంటెంట్‌ను అందిస్తోంది. ఎరోస్ నౌ 12000 కంటే ఎక్కువ సినిమా టైటిల్స్, ప్రీమియం, ఒరిజినల్స్, మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫారమ్ కంటెంట్ వంటి వాటితో కూడిన కంటెంట్ కేటలాగ్‌ను అందిస్తుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications