భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) రూ.365 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఎంపిక చేసిన రాష్ట్రాల్లో దీనిని తీసుకు వచ్చింది. ఈ ప్లాన్ కాలపరిమితి 365 రోజులు. రోజుకు 250 చొప్పున అపరిమిత వాయిస్ కాల్స్ వెసులుబాటు ఉంది. అలాగే రోజుకు 2GB రోజువారీ డేటాక్యాప్ ఉంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. అయితే ఈ ఉచితాలు 60 రోజులు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. 60 రోజుల ఉచిత పరిమితి ముగిసిన తర్వాత వాయిస్, డేటా వోచర్స్ అవసరం.

రూ.365తో 365 రోజుల వ్యాలిడిటీ.. కానీ..
ప్రభుత్వరంగ టెల్కో BSNL ఈ సరికొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఏడాది కాలపరిమితితో కూడిన రూ.365 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులను ఆకర్షించేలా ఉంటుంది. కానీ 60 రోజుల నిబంధన ఆకర్షణీయం కాకపోవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం కేరళలో వెబ్ సైట్‌లో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, అసోం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కోల్‌కతా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు (చెన్నై), చత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్తాన్, యూపీ ఈస్ట్, యూపీ వెస్ట్ వంటి ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టనుంది.
ఈ ప్లాన్ కింద 2 నెలల పాటు పలు ఉచితంగా పలు ఆఫర్లను అందిస్తోంది. వీటిలో రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్‌తో పాటు 2GB డాటా, 100 ఎస్సెమ్మెస్‌లు ఉన్నాయి. రోజులో 2GB డాటా పూర్తయ్యాక ఇంటర్నెట్ వేగం 80Kbpsకు తగ్గిపోతుంది. ఇవి కేవలం తొలి 2 నెలల మాత్రమే ఉంటాయి. మిగతా 10 నెలల పాటు ఎలాంటి ఆఫర్లు ఉండవు.

వారికే ఇది ఉపయోగం
ఇప్పటికే చత్తీస్‌గడ్‌లో బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్‌ను తీసుకువచ్చింది. వినియోగదారులు రోజుకు 250 చొప్పున అపరిమిత వాయిస్ కాల్స్ పొందుతారు. 100 ఎస్సెమ్మెస్‌లు వస్తాయి. ఈ ప్లాన్‌తో ఎలాంటి డేటా లేదు. డేటా అవసరంలేని వారు లేదా కాల్ చేసేందుకు మాత్రమే సెకండ్ ఫోన్ వినియోగించే వారికి మాత్రమే ఇది ఉపయోగం.

ఇతర నెట్ వర్క్‌లలో..
ఇతర నెట్ వర్క్స్‌లోను లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ ప్లాన్స్ ఉన్నాయి. 365 రోజుల వొడాఫోన్ ఐడియా (Vi) రూ.1499 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 24GB డేటా, అపరిమిత టాక్ టైమ్, 3600 ఎస్సెమ్మెస్‌లు ఉంటాయి. Vi మూవీస్, టీవీ యాక్సెస్ చేసుకోవచ్చు. రూ.2399 వంటి మరో ప్లాన్ రూ.2595 ప్లాన్. రోజుకు 2GB డేటా, జీ5 సబ్‌స్క్రిప్షన్ ఉంది. ఎయిర్‌టెల్‌లోను రూ.1498 ప్లాన్ ఉంది. 24జీపీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications