BSNL News: కొత్తగా సూపర్ రీఛార్జ్ ప్లాన్స్.. టెన్షన్‌లో జియో, ఎయిర్‌టెక్, Vi కంపెనీలు..
BSNL Recharge Plan: ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్. ఇటీవలి కాలంలో ఇది ప్రైవేటు టెలికాం ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ముందుకు సాగుతోంది. తక్కువ ధరలకే మెరుగైన సేవలను ఆఫర్ చేస్తోంది.
ప్రస్తుత పోటీ వాతావరణంలో వినియోగదారులు సైతం తక్కువ ధరలకు మెరుగైన సేవలను అందించే కంపెనీల సేవలను వినియోగించేందుకు మెుగ్గు చూపుతున్నారు. ప్రధాన పోటీ మాత్రం రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మధ్య కొనసాగుతున్నప్పటికీ బీఎస్ఎన్ఎస్ తన సేవలను మెరుగుపరుచుకుంటూ వేగంగా దూసుకొస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులను టార్గెట్ చేస్తూ కొత్త చౌక రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెస్తోంది.

ఈ క్రమంలో ఏడాది ప్లాన్లను తక్కువ ధరలకే బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. నెలకు, మూడు నెలలకు ప్రతిసారి రీఛార్జ్ చేసుకోవటం కంటే ఇది లాభదాయకం కూడా. ఈ క్రమంలో ముందుగా రూ.1999 ప్లాన్ కింద వినియోగదారులు 365 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఏకకాలంలో 600 జీబీ డేటా, రోజుకు ఉచితంగా 100 ఎస్ఎమ్ఎస్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది.
ఇక బీఎస్ఎన్ఎల్ రూ.2399 ప్లాన్ పరిశీలిస్తే.. దీని కింద యూజర్లు ప్రతిరోజూ 2జీడీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఉచిత ఎస్ఎమ్ఎస్ అందుబాటులో ఉన్నాయి. పైగా ఇది సంవత్సర కాలానికి కావటం విశేషం. చివరగా రూ.2999 ప్లాన్ పరిశీలిస్తే ఇది అత్యధికంగా 395 రోజుల కాలం వ్యాలిడిటీని అందిస్తోంది. అంటే 13 నెలల కాలం పాటు రీఛార్జ్ ప్లాన్ సేవలను అందిస్తుంది. పైగా దీని కింద రోజూ వినియోగదారులు 3జీబీ డేటా, ఉచిత కాల్స్, ఎస్ఎమ్ఎస్ సౌలభ్యాన్ని కలిగి ఉన్నాయి. అలాగే 11 నెలల కాలం అంటే 336 రోజులకు కేవలం రూ.1499 రీచార్జీ ద్వారా సేవలను పొందే అవకాశం కూడా ఉంది.


Click it and Unblock the Notifications