BSNL big Offer: జియోకు BSNL దిమ్మతిరిగే షాక్.. అంబానీ కోటకు బీటలు ఖాయం

Jio News: భారత టెలికాం మార్కెట్లో జియో పలు సంచలనాలకు తెరతీసింది. భారత్‌ను డిజిటల్ ఇండియాగా తీర్చి దిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించింది. అయితే భారీ స్థాయిలో కస్టమర్లను ఆకర్షించేందుకు మొదటగా ఉచిత సిమ్‌తో పాటు ఫ్రీ డేటాను ఆఫర్ చేసింది. కాగా ఇప్పుడు ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL రంగంలోకి దిగింది.

పలు టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ రేట్లను పెంచుతూ పోతుండగా.. BSNL అందుకు భిన్నంగా ఆ ఖర్చులను తగ్గించింది. ఇలా సరసమైన ఆఫర్లతో ప్రత్యర్థుల కస్టమర్లను తనవైపు ఆకర్షించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. తాజాగా గతంలో జియో అనుసరించిన విధానాన్నే ఇప్పుడు BSNL కూడా ఆచరిస్తోంది.

BSNL get ready to shock Jio with Ambani s own strategy

తన కస్టమర్ల డిజిటల్ అనుభూతిని మెరుగుపరచడానికి వారిని 4G నెట్‌వర్క్‌కు మార్చాలని భావిస్తోంది. ఇందుకోసం జియో మాదిరిగానే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉచిత సిమ్ పంపిణీని ప్రారంభించింది. మారుమూల ప్రాంతాలకు సైతం తమ కస్టమర్ బేస్‌ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 4G సిమ్ ఇచ్చి వినియోగదారులను అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తోంది.

దగ్గర్లోని BSNL వినియోగదారుల సేవా కేంద్రం, సహా ఫ్రాంచైజీలను సంప్రదించి ఈ ఉచిత 4G సిమ్ పొందవచ్చు. సాధారణ కేవైసీ పత్రాలైన ఆధార్, ఓటర్ కార్డులతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్స్ సమర్పించి సిమ్ సొంతం చేసుకోవచ్చు. గతంలో పేపర్ అప్లికేషన్స్ ద్వారా తీసుకున్న సిమ్‌లను కూడా ఇప్పుడు డిజిటల్‌ కు మార్చాలని కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+