BSNL: గతంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పరిస్థితి ప్రస్తుతం ఏమంత బాగాలేదు. భారీ నష్టాల్లో కూరుపోతోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాస్ 8 వేల 161 కోట్లకు చేరింది. FY23లో నమోదైన 6 వేల 981 కోట్లతో పోలిస్తే పెద్దఎత్తున పెరిగింది.
ప్రభుత్వానికి సర్దుబాటు చేయబడిన స్థూల రాబడి (AGR) బకాయిల కేటాయింపే ఏకీకృత నష్టాలు పెరగడానికి ప్రధానం కారణంగా కనిపిస్తోంది. ఎందుకంటే, 17 వేల 688 కోట్ల విలువైన AGR బకాయిలను BSNL ప్రభుత్వానికి అందించింది. 16 వేల 189 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ను పొందింది. తద్వారా అనూహ్యంగా 1,499 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.

ఇక BSNL మొత్తం ఖర్చులు 5.1 శాతం పెరిగి 27 వేల 364 కోట్లకు చేరాయి. జీతాలు, వేతనాలు, అలవెన్సులు మరియు ఇతర ప్రయోజనాలతో కూడిన ఉద్యోగుల వ్యయమే ఇందులో 7 వేల 952 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. FY22తో పోలిస్తే 11 శాతం పెరిగిందన్నమాట. అయితే ప్రభుత్వ లక్ష్యాన్ని కంపెనీ అధిగమించడం విశేషం. తన కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో 14 శాతం వృద్ధిని సాధించింది. సంస్థ ఆర్థిక నివేదికల ప్రకారం FY22లో 16 వేల 811 కోట్లుగా ఉన్న ఈ రాబడి FY23లో 19 వేల 130 కోట్లకు పెరిగింది.
ఆయా సర్కిళ్ల పరంగా చూస్తే.. 2023లో కేరళ నుంచి BSNL ఆదాయం దాదాపు 2% తగ్గి 1,656 కోట్లకు చేరుకుంది. కర్ణాటక, జమ్మూ & కాశ్మీర్, పంజాబ్, అండమాన్ మరియు నికోబార్, UP (పశ్చిమ), గుజరాత్, చెన్నై మరియు తెలంగాణాల్లో సైతం ఆదాయం భారీగా పడిపోయింది. దీనికి తోడు మార్చి చివరి నాటికి.. BSNL వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ బేస్ 103.6 మిలియన్లుగా ఉంది. దేశంలోని టాప్ 4 ప్రముఖ టెలికాం ఆపరేటర్‌లతో పోలిస్తే ఇదే అత్యల్పం. గత 15 నెలల్లో కంపెనీ దాదాపు 11 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లన సైతం కోల్పోయింది.


Click it and Unblock the Notifications