న్యూఢిల్లీ: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. లైఫ్‌టైమ్ ప్రీ-పెయిడ్ ప్లాన్స్‌ను కొనసాగించే విషయంలో చేతులెత్తేసింది. ఈ లైఫ్ టైమ్ ప్రీ పెయిడ్ ప్లాన్స్‌ను రద్దు చేసింది. దీన్ని కొనసాగించట్లేదని స్పష్టం చేసింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ ప్లాన్ ఇక అందుబాటులో ఉండదు. మనుగడలో కనిపించదు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ లైఫ్ టైమ్ ప్రీపెయిడ్‌లో కొనసాగుతోన్న వినియోగదారులను ప్రత్యామ్నాయ ప్లాన్‌లోకి షిఫ్ట్ చేయనుంది.
బీఎస్ఎన్ఎల్ లైఫ్ టైమ్ ప్లాన్స్‌తో యూజర్లకు తక్కువ టారీఫ్‌తో ప్రయోజనాలు లభిస్తుండేవి. వారి బెనిఫిట్స్‌కు ఎలాంటి నష్టం కలిగించకుండా మరో ప్లాన్‌లోకి బదలాయించనుంది. వారి మొబైల్ నంబర్లన్నింటినీ 107 రూపాయల ప్లాన్‌లోకి మార్చనుంది. ఈ మార్పు ప్రక్రియ డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. లైఫ్ టైమ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో వాటన్నింటినీ యధాతథంగా ఈ 107 రూపాయల ప్లాన్‌లోకి షిఫ్ట్ చేస్తామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం అధికారులు స్పష్టం చేశారు.

అదనంగా 107 రూపాయల ప్లాన్‌లో ఉండే కొన్ని అదనపు ప్రయోజనాలు వర్తించవని తెలిపారు. 107 రూపాయల ప్లాన్‌లో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ లేదు. దీని కాల పరిమితి మూడు నెలలు మాత్రమే. 90 రోజుల పాటు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది. అన్‌లిమిటెడ్ ఇన్‌కమింగ్ వాయిస్ కాల్స్ ఉంటాయి. లైఫ్ టైమ్ ప్లాన్‌తో యూజర్లకు 10 జీబీ డేటాను 30 రోజుల పాటు వినియోగించుకునే వెసలుబాటు ఉండేది. దీన్ని బీఎస్ఎన్ఎల్ శాశ్వతంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది.
24 రోజుల పాటు వంద నిమిషాల అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకునే ఉచితంగా చేసుకునే సౌకర్యం కూడా ఉండదని చెబుతున్నారు.అలాగే- 107 రూపాయల ప్లాన్‌లో సాధారణంగా లభించే ఉచిత సర్వీసులను- ఇందులోకి షిఫ్ట్ అయ్యే లైఫ్ టైమ్ ప్రీపెయిడ్ యూజర్లకు వర్తింపజేయదు బీఎస్ఎన్ఎల్. ఫ్రీ బీఎస్ఎన్ఎల్ డీఫాల్ట్ ట్యూన్స్, 84 రోజుల పాటు 3జీబీ ఉచిత డేటా వంటి యాడ్ ఆన్ ఫ్రీబీస్ అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని డీఓటీ అధికారులు స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications