Jio Vs BSNL: 2024 భారతీయ టెలికాం రంగంలో సంచలన మార్పులు జరిగాయి. దశాబ్థకాలానికి పైగా టెలికాంలో కొనసాగుతున్న ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో గుత్తాధిపత్యాన్ని కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ టాపకింద నీరులా ప్రస్తుతం అంబానీకి ఓటమి రుచిచూపిస్తోంది. చాలా కాలంగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన టెలికాం రంగం ప్రస్తుతం తిరిగి తన పూర్వ వైభవాన్ని చూస్తోంది.
చాలా కాలంగా ఇండియన్ టెలికాం రంగంలో ఉన్న ప్రైవేటు ఆటగాళ్లు జియో, ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియాలకు ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ గట్టి పోటీని ఇవ్వటానికి పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తన నెట్వర్క్ కవరేజీని విస్తుతంగా వస్తరిస్తున్న కంపెనీ త్వరలోనే తన 4జీ, 5జీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటానికి టాటాలతో కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది అనంత్ అంబానీ పెళ్లి తర్వాత జియో మెుబైల్ టారిఫ్ రేట్లను పెంచటంతో అదే దారిలో ఇతర ప్రైవేటు ఆపరేటర్లు సైతం వెళ్లాయి. దీంతో యూజర్లపై టారిఫ్ల భారం 15 శాతం వరకు పెరిగింది. దీంతో చాలా మంది ఘర్ వాపసీ అంటూ తిరిగి ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ కి తిరిగి వస్తున్నారు.

ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ దెబ్బకు రిలయన్స్ జియో తట్టుకోలేకపోతోంది. ఏకంగా గడచిన నాలుగు నెలల కాలంలోనే దాదాపు 1.65 కోట్ల మంది యూజర్లను కోల్పోవటంతో ప్రస్తుతం అంబానీ పెద్ద డైలమాలో ఉన్నారు. ట్రాయ్ డేటాను పరిశీలిస్తే.. జియో అక్టోబర్‌లో 37.6 లక్షలు, సెప్టెంబర్‌లో 79 లక్షలు, ఆగస్టులో 40 లక్షలు మరియు జూలైలో 7.58 లక్షల మంది వినియోగదారులను కోల్పోయినట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో రెండవ స్థానంలో కొనసాగుతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ సెప్టెంబర్‌లో ఎయిర్‌టెల్ 14.3 లక్షల మంది యూజర్లను నష్టపోయినట్లు డేటా చెబుతోంది. ఇక ఆగస్టులో ఎయిర్‌టెల్ 24 లక్షల మంది, జూలైలో 16 లక్షల మందిని వదులుకుంది. బతకేందుకు అష్టకష్టాలు పడుతున్న మరో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా అక్టోబర్‌లో 19 లక్షల మంది, సెప్టెంబర్‌లో 15.5 లక్షల మంది కస్టమర్లను వదులుకోగా.. బీఎస్ఎన్ఎల్ మాత్రం గడచిన నాలుగు నెలలుగా 68 లక్షల మంది కొత్త వినియోగదారులను పొందింది.
అక్టోబరు ట్రాయ్ డేటా ప్రకారం ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ కేవలం 3.6 కోట్ల మంది వినియోగదారులను కలిగి నాల్గవ స్థానంలో కొనసాగుతోంది. ఇది మెుత్తం భారతదేశపు టెలికాం వినియోగదారుల్లో 8.05 శాతం వాటా మాత్రమే. అయితే అగ్రగామిగా ఉన్న జియో దాదాపు 40 శాతం మార్కెట్ వాటాను హోల్డ్ చేస్తుండగా, ఎయిర్ టెల్ 33.50 వాటాను కలిగి ఉంది. ఇక మిగిలిన వాటాను విఐ కొనసాగిస్తోంది. ప్రస్తుతం నిరంతరాయంగా బీఎస్ఎన్ఎల్ కు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నందున రానున్న రెండు మూడేళ్లలో టెలికాం మార్కెట్లో పెద్ద ఆటగాడిగా కంపెనీ తన పాత్రను పోషించేందుకు రోజులు దగ్గరపడుతున్నాయని నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిని ఎదుర్కొనేందుకు ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు ఎలా సన్నద్దం అవుతారనే విషయంపై చర్చ కొనసాగుతోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications