BSNL 4G: ప్రస్తుతం దేశీయ టెలికాం వ్యాపారంలో పెద్ద మార్పులు వస్తున్నాయి. వినియోగదారులు జియో రేట్ల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని తర్వాత మిగిలిన ప్రైవేట్ ఆపరేటర్లు సైతం తమ టారిఫ్ రేట్లను పెంచటంతో పెంపులను వ్యతిరేకిస్తున్న లక్షలాదిమంది బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయ్యేందుకు క్యూ కడుతున్నారు.
వాస్తవానికి దేశీయ భడా టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియాలు వరుసగా తమ రీచార్జ్ ప్లాన్ రేట్లను పెంచి మెుబైల్ యూజర్లపై భారీ భారాన్ని మోపాయి. ఇది అనూహ్యంగా BSNLకి కలిసొస్తోంది. దేశంలోని అనేక చోట్ల ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. BSNL 4G టెక్నాలజీని గర్వంగా చూడాలని కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. అయితే కంపెనీ 4జీ సర్వీసును ఎప్పుడు ప్రారంభించనుందన్న విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే సాధ్యమైనంత త్వరలో 4జీ, 5జీ సేవలను ప్రారంభిస్తాయని హామీ ఇచ్చారు.

దేశంలోని కోట్లాది మంది వినియోగదారులకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటాలు ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ కు సహకరిస్తున్నారు. ఈ క్రమంలో తేజస్, బీఎస్ఎన్ఎల్, టీసీఎస్, సీడీఓటీ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని సింధియా పేర్కొన్నారు. భారత్‌లో సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇది దేశీయ వినియోగానికి మాత్రమే కాకుండా ఎగుమతికి కూడా ఉపయోగించబడుతుందని పేర్కొన్నారు. గడచిన ఏడాది దేశీయ టెలికాం పరికరాల ఎగుమతులు రూ.20,000 కోట్లకు చేరువయ్యాయని చెప్పారు.
5Gలో వేగవంతమైన వృద్ధిని చూస్తున్న భారత్.. 6G టెక్నాలజీ అభివృద్ధికి నాయకత్వం వహించడానికి కృషి చేస్తోందని సింధియా చెప్పారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి భారత్ డిజిటల్ ఫ్రంట్‌లో అభివృద్ధి చెందుతుండగా, సైబర్ సెక్యూరిటీ ఫ్రంట్‌లో పెద్ద ముప్పు తలెత్తిందని ఆయన అన్నారు. ఆధునిక యుగంలో యుద్ధాలు భూమిపైనే కాకుండా అనేక ఇతర మార్గాల్లో జరుగుతున్నాయని చెప్పారు. సైబర్ భద్రత విషయానికొస్తే దేశాలు, పౌరులు, వ్యాపారాలను రక్షించడం చాలా ముఖ్యమైనదిగా అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో జియోను బహిష్కరించాలనే ట్రెండ్ తో పాటు తిరిగి వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కు వెళ్లాలనే పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ ఇప్పటికే.. టాటాలకు చెందిన టీసీఎస్ తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాటాలు 4జీ సాంకేతిక అభివృద్ధితో పాటు దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు. టాటాల సహకారంతో BSNL దేశవ్యాప్తంగా 9000 కంటే ఎక్కువ 4G నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications