BSNL Plans: రిలయన్స్ గ్రూప్ టెలికాం వ్యాపారంలోకి జియోతో వచ్చిన తర్వాత పెద్ద మార్పులు మెుదలయ్యాయి. అంబానీ యుద్ధంతో ప్రముఖ ఆటగాళ్లు సైతం కనుమరుగయ్యారు. ఈ క్రమంలో అనేక టెలికాం ఆపరేటర్లు తమ వ్యాపారాలను ఇతర సంస్థలకు విక్రయించి మార్కెట్ల నుంచి తప్పుకున్నాయి. ఇదే క్రమంలో 2జీ స్కామ్ వంటి విషయాలు వెలుగులోకి రావటంతో ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ సైతం టెక్నాలజీ పరంగా వెనుకపడాల్సి వచ్చింది.
అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జియోను ఎదురించేందుకు ఒకపక్క ప్రైవేట్ టెలికాం రంగంలోని ఎయిర్‌టెల్, వీఐ తమ పోటీతత్వంతో హీట్ పెంచుతుండగా.. వీరెవ్వరి ఊహలకు అందని ప్లాన్లతో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల అనంత్ అంబానీ వివాహ సమయంలో జియో రేట్ల పెంపుకు దిగటంతో యూజర్లు తిరిగి బీఎస్ఎన్ఎల్ కు వెళ్లటమనే ట్రెండ్ ప్రారంభమైంది. దీంతో చాలామంది యూజర్లు ఇప్పటికే బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ అవుతున్నారు.

తాజాగా బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం 54 రోజుల వ్యాలిడిటీతో కేవలం రూ.347కే ఒక ఆకర్షనీయమైన ప్లాన్ ప్రవేశపెట్టింది. అయితే రెండు నెలల కాలానికి ఇంత తక్కువ రేటులో ఇతర ఆపరేటర్లు ఎవ్వరూ అందించని ప్లాన్ తీసుకురావటం గమనార్హం. ప్లాన్ కింద వినియోగదారులు 54 రోజుల కాలానికి అపరిమితంగా ఉచిత కాల్స్ పొందుతారు. అలాగే రోజుకు 100 SMSలు, రోజుకు 3జీబీ డేటాతోపాటు అదనంగా 3 జీబీ డేటాతో కలిపి మొత్తంగా 165 జీబీ డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. దీనికి తోడు కంపెనీ అదనంగా మరిన్ని సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను సైతం బండిల్ ఆఫర్ కింద అందిస్తోంది.
ఇప్పటికే టాటాలు బీఎస్ఎన్ఎల్ ఇన్ ఫ్రాను సిద్ధం చేసేపనిలో వేగంగా సాగుతుండగా.. వేల సంఖ్యలో కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు టవర్ల ఏర్పాటు మరోపక్క కొనసాగుతోంది. త్వరలో కంపెనీ తన కస్టమర్లకు సూపర్ స్పీడ్ 4జీని అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తుండగా.. 5జీని కూడా అందుబాటులోకి తెచ్చే పనిలో ఉంది.
మారుతున్న సిమ్ కార్డ్ నిబంధనలు..
డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. ఇకపై సిమ్ కార్డుల కోసం కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి. వ్యక్తుల అధికారిక పత్రాలు దుర్వినియోగాన్ని, మోసాలకు ఉపయోగించటాన్ని అరికట్టేందుకు మార్పులు తీసుకొస్తోంది. దీని ద్వారా టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ వినియోగదారుల కోసం ఈ - కెవైసీ, సెల్ప్ కెవైసీని ప్రవేశపెట్టింది. అలాగే సులభంగా ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ యూజర్‌గా మారేందుకు ఓటీపీ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications