BSNL Plans: దేశీయ టెలికాం వ్యాపారంలో పోటీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో ఇప్పటికే అగ్రగామి సంస్థలుగా కొనసాగుతున్న జియో, ఎయిర్ టెల్ కంపెనీలకు పోటీ ఇవ్వటంలో ప్రభుత్వ యాజమాన్య టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఏమాత్రం వెనుకాడటం లేదు. మరో పక్క వొడఫోన్ ఐడియా కంపెనీ కొత్త పెట్టుబడులతో 5జీ సేవలను విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.
ఒకపక్క దేశంలో ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న వేళ ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మెగా డేటా ప్లాన్ ప్రవేశపెట్టింది. 600GB డేటాతో సూపర్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంపెనీ ప్రస్తుతం దేశంలో వేగవంతమైన 4జీ సేవలను అందిస్తోంది. త్వరలోనే ప్రైవేటు ఆపరేటర్లకు పోటీగా 5జీ సేవలను తన యూజర్లకు అందించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దీనికోసం టాటాలతో కలిసి కంపెనీ పనిచేస్తోంది.

ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ 365 రోజుల చెల్లుబాటుతో ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో రీఛార్జ్ చేసేవారు సంవత్సరానికి 600GB డేటాను పొందవచ్చు. ఇక్కడ రోజువారీ ఇంటర్నెట్ వినియోగంపై ఎలాంటి పరిమితి ఉండకపోవటం ఐపీఎల్ సమయంలో వినియోగదారులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉండనుంది. దీనికి సంబంధించిన వివరాలను బీఎస్ఎన్ఎల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ స్కీమ్ కి PV1999 అని పేరు పెట్టింది. అంటే ఈ ప్రయోజనాలను పొందాలంటే వినియోగదారులు అందుకోసం 1995 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్లాన్ కింద వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యంతో పాటు ఉచిత రోమింగ్‌తో పాటు ఈ ఏడాది వ్యవధిలో 600 GB డేటా అందించబడుతోంది. అలాగే ప ప్లాన్‌తో రోజుకు 100 SMSలను ఉచితంగా పొందుతారు. అలాగే WOW ఎంటర్‌టైన్‌మెంట్, జింగ్ మ్యూజిక్, హార్డీ గేమ్స్, BSNL ట్యూన్స్, ఛాలెంజర్ అరీనా గేమ్‌లను ఉచితంగా ఉపయోగించవచ్చు.


Click it and Unblock the Notifications