BSE Stock Crash: సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఉల్లాసంగా మెుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఎస్ఈ షేర్లు మాత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో ఒక్కరోజులోనే అత్యధికంగా 18 శాతం క్షీణించి ఇన్వెస్టర్లను భయపడెతున్నాయి.
వాస్తవానికి బీఎస్ఈ కంపెనీ షేర్లు దేశీయ్ స్టాక్ మార్కెట్లలోకి 2017లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్టాక్ చరిత్రలో ఒక్కరోజులో ఇంత భారీ పతనం ఎప్పుడూ నమోదు కాలేదు. ఇదే క్రమంలో సెబీ తాజా ఆర్డర్ తర్వాత మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(MCX) షేర్లు కూడా నేడు ఇంట్రాడేలో 7% పడిపోయాయి.

బీఎస్ఈ స్టాక్ పతనానికి కారణాన్ని పరిశీలిస్తే.. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ తాజాగా బీఎస్ఈని రెగ్యులేటరీ ఫీజును వార్షిక ఆప్షన్స్ కాంట్రాక్ట్ టర్నోవర్ ఆధారంగా చెల్లించాలని ఆదేశించటంతో తాజా పతనం నమోదైంది. బీఎస్ఈని దాని ఆప్షన్ కాంట్రాక్టుల 'జాతీయ విలువ' నుంచి లెక్కించిన వార్షిక టర్నోవర్ ఆధారంగా SEBIకి రెగ్యులేటరీ ఫీజులను చెల్లించమని ఆదేశించింది. ఉదాహరణకు ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ రూ.50 వద్ద ట్రేడ్ అయ్యే స్టాక్‌లోని 100 షేర్లను సూచిస్తే.. నోషనల్ విలువ రూ.5,000 అవుతుంది. ఇందులో వడ్డీతో పాటు గత కాలానికి సంబంధించిన రెగ్యులేటరీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పరిణామంతో అంతర్జాతీయ రేటింగ్ సంస్థ జెఫరీస్ బీఎస్ఈ షేర్ల రేటింగ్ ను రెండింతలు తగ్గించింది. గతంలో తాను ఇచ్చిన BUY రేటింగ్ నుంచి HOLD రేటింగ్ కు తగ్గిస్తున్నట్లు తన తాజా ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో బీఎస్ఈ షేర్లకు టార్గెట్ ధరను గతంలో ఇచ్చిన రూ.3,000 నుంచి రూ.2,900కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఉదయం 11.45 గంటల సమయంలో బీఎస్ఈ స్టాక్ రేటు రూ.2,800 స్థాయి వద్ద దాదాపు 13 శాతం క్షీణతతో కొనసాగుతోంది. సెబీ పంపిన నోటీసులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పిన కంపెనీ నోటీసుల ఆదారంగా చెల్లింపులు చేపట్టాలంటే ఈ ఏడాదికి రూ.96.30 కోట్లతో పాటు జీఎస్టీ అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే పాత చెల్లింపులకు వడ్డీతో సహా రూ.128.98 కోట్లతో పాటు జీఎస్టీని చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications